కింగ్డమ్, వార్-2 దెబ్బకు నాగ వంశీ అజ్ఞాతంలోకి అన్నారు.. ‘ఎక్స్’లో షాకింగ్ పోస్ట్తో కౌంటరిచ్చాడుగా !

కింగ్డమ్, వార్-2 దెబ్బకు నాగ వంశీ అజ్ఞాతంలోకి అన్నారు.. ‘ఎక్స్’లో షాకింగ్ పోస్ట్తో కౌంటరిచ్చాడుగా !

నిర్మాత సూర్య దేవర నాగవంశీ (Naga Vamsi) తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితం. ప్రస్తుతం నాగవంశీ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అంతేకాదు వరుస భారీ సక్సెస్ లతో మంచి జోష్ మీద ఉన్నాడు. అంతేకాకుండా ఖాళీ టైం దొరికితే, సినిమా ఇండస్ట్రీలోని పలు అంశాలపై ఇంటర్వ్యూలు, పాడ్కాస్ట్లలో స్పందిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వస్తున్నాడు.

అలాగే, ఎవరైనా కావాలని కాంట్రవర్సీ క్రియేట్ చేయాలనీ చూసిన అతనికి నచ్చదు. ఒకవేళ వాళ్లే ముందుకొచ్చి తనపై కామెంట్ చేస్తే మాత్రం, తనదైన శైలిలో మాట్లాడి, చెమటలు పట్టించేస్తాడు. ఇప్పుడు అచ్చం అలాగే, గత వారం రోజుల నుంచి తనపై జరుగుతున్న సోషల్ మీడియా దాడికి, తనదైన శైలిలో రియాక్ట్ అయ్యాడు. ఇప్పుడు మరింత కొత్త యాంగిల్లో నెటిజన్లకు చురకలు అంటించాడు. వివరాల్లోకి వెళితే.. 

ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ నటించిన ‘వార్‌ 2’ (War2)  ఆగస్టు 14న విడుదలైన విషయం తెలిసిందే. ఈ మూవీ నైజాం హక్కులను నిర్మాత నాగవంశీ భారీ ధరకు కొని రిలీజ్ చేశాడు. అయితే, సినిమాకు మిక్సెడ్ టాక్ రావడంతో భారీ నష్టాలూ వచ్చాయని, ఇక నాగవంశీ పని అయిపోయిందని ట్రోలింగ్ జరుగుతుంది. ఈ క్రమంలోనే నేడు (ఆగస్టు 20న) తన తన X అకౌంట్ ద్వారా స్పందించాడు.

ALSO READ : ఫస్ట్ టైం ఓటీటీ సంస్థ నిర్మించిన మూవీ..

 “ఏంటీ నన్ను చాలా మిస్ అవుతున్నట్లు ఉన్నారు.. వంశీ అది.. వంశీ ఇది.. అని గ్రిప్పింగ్ నెరేటివ్స్తో ఫుల్ హడావిడి నడుస్తుంది.. పర్లేదు, Xలో మంచి రైటర్స్ ఉన్నారు. కానీ మిమ్మల్ని నిరాశ పరుస్తున్నందకు క్షమించండి.. కానీ ఇంకా ఆ టైమ్ రాలేదు.. మినిమం ఇంకో పది, పదిహేనేళ్లు ఉంది. సినిమాకు దగ్గరగా, సినిమా కోసమే ఎప్పుడూ.. మా నెక్ట్స్ మూవీ మాస్ జాతరలో త్వరలోనే కలుద్దాం” అని నాగ వంశీ అన్నాడు. ఇప్పుడీ ట్వీట్ సోషల్ మెడియలో వైరల్ అవుతోంది.

అసలేం జరిగిందంటే:

హీరో విజయ్ దేవరకొండ నటించిన కింగ్‌‌‌‌డమ్ మూవీని నాగవంశీ భారీ బడ్జెట్తో నిర్మించారు. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రూ.56 కోట్ల నెట్, రూ.112 కోట్ల గ్రాస్ కలెక్షన్లుగా ట్రేడ్ పండితులు లెక్కకట్టారు. కానీ, ఇండియా బాక్సాఫీస్ దగ్గర మూవీ రూ.51.88 కోట్ల నెట్ మాత్రమే సాధించింది. ఈ క్రమంలో సినిమాకు నష్టాలూ తప్పలేదు.

అలాగే, వార్ సినిమాని నైజాం హక్కులను దాదాపు రూ.35 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు టాక్. సినిమా ఇప్పటివరకు రూ.15 నుంచి 20 కోట్ల వసూళ్లు చేసింది. ఈ క్రమంలో నాగవంశీకి 50% కంటే ఎక్కువ నష్టం వచ్చేలా ఉందని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

అంతేకాకుండా ఈ రెండు సినిమాల నష్టాలతో నాగవంశీ పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు, పనై అయిపోయిందని నెటిజన్లతో పాటు సినీ క్రిటిక్స్ సైతం ట్రోలింగ్ మొదలెట్టారు. ఇక లేటెస్ట్గా నాగవంశీ ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్తో అందరీ నోర్లు ముసినట్టైంది.