
మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘లిటిల్ హార్ట్స్’. ఈ చిత్రానికి సాయి మార్తాండ్ దర్శకుడు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ‘90sమిడిల్ క్లాస్ బయోపిక్’దర్శకుడు ఆదిత్య హాసన్ నిర్మించాడు. బన్నీ వాస్, వంశీ నందిపాటి సెప్టెంబర్ 12న థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. మంగళవారం టీజర్‌ను అనిల్ రావిపూడి లాంచ్ చేశారు.
టీజర్ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించేలా సాగింది. ముఖ్యంగా మౌళి, శివానీ మధ్య వచ్చే లవ్ ట్రాక్ ఆకట్టుకుంటోంది. కాలేజ్ లైఫ్, కుర్రాళ్ల తుంటరి పనులు, అమ్మాయిల వెనక తిరగడం, ఎమ్‌సెట్ ప్రిపరేషన్.. ఇలా ప్రతిదీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. మరోసారి తన నటనతో మౌళి మెప్పించాడు.
అయితే, ఓటీటీ సంస్థ ఒరిజినల్ సినిమాగా తెరకెక్కి, ఆ ఓటీటీలో కాకుండా, ముందుగా థియేటర్లలో విడుదల కానుంది ఈ సినిమా. సాధారణంగా థియేటర్ సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేస్తుంటారు. మరికొన్నిసార్లు సూపర్ హిట్ అయిన ఓటీటీ సినిమాలను థియేటర్లలో విడుదల చేస్తుంటారు. కానీ, ఫర్ ది ఫస్ట్ టైమ్ ఓటీటీ సంస్థ ఒరిజినల్ సినిమాగా తెరకెక్కి ఆ ఓటీటీలో కాకుండా, ముందుగా థియేటర్లలో విడుదల కానుంది ‘లిటిల్ హార్ట్స్’.
థియేటర్ రిలీజ్ అందుకేనా?
‘లిటిల్ హార్ట్స్’థియేటర్కి వస్తుండటం వెనుక మంచి ఆలోచనే ఉందంటున్నారు సినీ క్రిటిక్స్. అందుకు ముఖ్య కారణం.. సినిమా కంటెంట్పై మేకర్స్కి బలమైన నమ్మకం ఉండటమే. ఎందుకంటే, ఈ మూవీ ముందుగా థియేటర్స్లో రిలీజ్ చేస్తే.. ఆడియన్స్ మనసులను గెలుచుకోవడమే కాకుండా, వసూళ్లు కూడా తెచ్చుకోవడం కన్ఫామ్. ఇది మేకర్స్కి రెండు విధాలుగా కలిసొచ్చే అంశంమని టాక్. ఆ తర్వాత ఓటీటీ ఆడియన్స్ ఎలాగో కుమ్మేస్తారు కూడా!
లాస్ట్ టైం ఇదే ఓటీటీ నుంచి వచ్చిన సుమంత్ 'అనగనగా' మూవీ భారీ రెస్పాన్స్ అందుకుంది. అలాగే, ‘90sమిడిల్ క్లాస్ బయోపిక్’ సైతం నేరుగా ఓటీటీకే వచ్చి సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ఆ టైంలోనే చాలా మంది క్రిటిక్స్.. ఈ రెండు సినిమాలను థియేటర్లో రిలీజ్ చేసుంటే.. ఇంకా బాగుండేదనే టాక్ వచ్చింది. ఆడియన్స్ నుంచి కూడా అదే స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే ఇపుడు ‘లిటిల్ హార్ట్స్’ని నేరుగా ఓటీటీకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
ALSO READ : ఎన్టీఆర్ 'డ్రాగన్' షూటింగ్..
ఇదిలా ఉంటే.. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్లో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘టీనేజ్ సరదాల నేపథ్యంలో వస్తున్న ఈ మూవీ టీజర్ బాగా నచ్చింది. గల్లీలో కొట్లాటలు, తల్లిదండ్రులతో చివాట్లు, అమ్మాయిల చుట్టూ చక్కర్లు, ఎంసెట్ ఎగ్జామ్ టెన్షన్స్ లాంటివన్నీ చాలా లైవ్‌లీగా అనిపించాయి.
కామెడీ సినిమాను థియేటర్స్‌లో చూస్తే వచ్చే వైబ్‌ను నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఈ యంగ్ టీమ్ తమ సినిమాను ఎంతో గట్స్‌తో థియేటర్స్‌కు తీసుకొస్తుండడం హ్యాపీగా ఉంది’ అన్నారు. ‘ఇంటర్మీడియట్ పిల్లలతోపాటు ప్రతి పేరెంట్ చూడాల్సిన సినిమా’ అని బన్నీ వాస్ అన్నారు.
కడుపుబ్బా నవ్వుకునేలా ఉంటుందని వంశీ నందిపాటి చెప్పారు. హీరోహీరోయిన్స్‌తో పాటు నటుడు రాజీవ్ కనకాల, దర్శకుడు సాయి మార్తాండ్, మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ యెర్రమల్లి, ఈటీవీ విన్ నుంచి నితిన్ తదితరులు పాల్గొన్నారు.
A glimpse of hilarious moments and relatable comedy!❤️💥
— ETV Win (@etvwin) August 19, 2025
Madly Entertaining #LittleHearts Teaser Out Now😁
▶️ https://t.co/0RQrKTluwq#LittleHeartsOnSep12th@etvwin @marthandsai #AdityaHasan @mouli_talks @shivani_nagaram @TheBunnyVas @connect2vamsi @VNE_Offl @krishna_kri… pic.twitter.com/KmdFz0p04M