ఏప్రిల్ 26 నుంచి కోచింగ్ క్యాంపులు.. అప్లై చేసుకోవాలంటున్న అధికారులు

ఏప్రిల్ 26 నుంచి కోచింగ్ క్యాంపులు.. అప్లై చేసుకోవాలంటున్న అధికారులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: సమ్మర్ ​కోచింగ్​క్యాంపులు ఈ నెల 26 నుంచి మే 31 వరకు నిర్వహించనున్నామని అధికారులు తెలిపారు. 44 రకాల క్రీడల్లో ఆరేండ్ల నుంచి 16 ఏండ్లలోపు వారికి శిక్షణ ఇవ్వనున్నారు. కార్పొరేషన్లలో విలీనమైన 27 లోకల్ బాడీల  పరిధిలోనూ క్యాంపులు నిర్వహించనున్నారు.  ట్రై సిటీల్లో శిక్షణ ఇచ్చేందుకు 1500 మంది హానరరీ కోచ్(వేతనం లేకుండా) లను  నియమించున్నారు.

కోచింగ్ ఇచ్చినందుకు వీరికి ట్రాక్ షూట్, షూస్​ఇవ్వనున్నారు. వారం రోజులుగా ఆన్ లైన్ ద్వారా  https://sports.ghmc.gov.in/  అప్లికేషన్లను స్వీకరిస్తున్నారు. షటిల్, బ్యాడ్మింటన్, రోలర్ స్కేటింగ్, క్రికెట్, టెన్నిస్ క్రీడ లకు రూ.50,  మిగతా క్రీడలకు రూ.10 ఫీజు  చెల్లించాల్సి ఉంది.