ఆగ్రోస్ భూముల ఆక్రమణల తొలగింపు.. 23.28 ఎకరాల భూమికి ఫెన్సింగ్

ఆగ్రోస్ భూముల  ఆక్రమణల తొలగింపు..  23.28 ఎకరాల భూమికి ఫెన్సింగ్

హైదరాబాద్, వెలుగు: ఆగ్రో ఇండస్ట్రీస్​కు సంబంధించిన దాదాపు 4 ఎకరాల ప్రభుత్వ భూమిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగించింది. మౌలాలిలో ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ కు చెందిన భూములను స్థానికులు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. 

శుక్రవారం ఆగ్రోస్​చైర్మన్ బాలరాజు ఆధ్వర్యంలో సిబ్బంది, హైడ్రా సిబ్బంది డిమాలిషన్​ చేసి 4 ఎకరాల ప్రభుత్వ భూమిలో తిరిగి స్వాధీనం చేసుకున్నారు. హైడ్రా అధికారుల సహకారంతో ఆక్రమణలో తొలగించి మొత్తం 23 ఎకరాల 28 గుంటల భూమికి  ఫెన్సింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆగ్రోస్​మేనేజ్​యూనుస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.