వడ్ల తరలింపునకు లారీలు అందుబాటులో ఉంచాలి : అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్ నగేశ్‌‌‌‌‌‌‌‌

 వడ్ల తరలింపునకు లారీలు అందుబాటులో ఉంచాలి : అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్ నగేశ్‌‌‌‌‌‌‌‌
  • అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్ నగేశ్‌‌‌‌‌‌‌‌

రాజన్న సిరిసిల్ల, వెలుగు: కొనుగోలు కేంద్రాల్లో వడ్ల తరలింపునకు లారీలు అందుబాటులో ఉంచాలని అడిషనల్ కలెక్టర్ నగేశ్‌‌‌‌‌‌‌‌ అధికారులు, సెంటర్ల నిర్వాహకులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో బోయినిపల్లి, కోనరావుపేట మండలాలకు చెందిన కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, లారీల కాంట్రాక్టర్లతో రివ్యూ నిర్వహించారు. ఆయా మండలాల్లో ధాన్యం కొనుగోళ్లు, నిల్వలు, తరలింపుపై ఆరా తీశారు. సమావేశంలో జిల్లా సివిల్‌‌‌‌‌‌‌‌ సప్లై ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చంద్ర ప్రకాశ్, డీఎం రజిత, డీసీవో రామకృష్ణ పాల్గొన్నారు.


వేములవాడ: ---వేములవాడ అర్బన్ మండలం నాంపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్ నగేశ్‌‌‌‌‌‌‌‌ పరిశీలించారు. అక్కడే ఉన్న  రైతులతో మాట్లాడారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని నిర్వాహకులను ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ విజయ ప్రకాశ్‌‌‌‌‌‌‌‌రావు ఉన్నారు.