ఈసీ రూల్స్‌‌‌‌‌‌‌‌కు అనుగుణంగా పనిచేయాలి : కలెక్టర్ గరిమా అగ్రవాల్

ఈసీ రూల్స్‌‌‌‌‌‌‌‌కు అనుగుణంగా పనిచేయాలి : కలెక్టర్ గరిమా అగ్రవాల్
  • ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్

రాజన్నసిరిసిల్ల,వెలుగు: రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) రూల్స్‌‌‌‌‌‌‌‌కు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్, ముస్తాబాద్ లోని రైతు వేదికలో ప్రిసైడింగ్ ఆఫీసర్లకు ఎన్నికల నిర్వహణలో భాగంగా వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌‌‌‌‌‌‌‌ ఆదేశాల మేరకు పనిచేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రంలో కరెంట్‌‌‌‌‌‌‌‌, నీటి వసతులను తనిఖీ చేయాలన్నారు.

 బ్యాలెట్ బాక్సులు, పేపర్లు, ఇంక్‌‌‌‌‌‌‌‌.. సామాగ్రిని డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన వాహనాల్లోనే తరలించాలని స్పష్టం చేశారు.  అనంతరం ముస్తాబాద్ గ్రామ పంచాయతీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. అధికారులతో మాట్లాడి నామినేషన్‌‌‌‌‌‌‌‌ ప్రక్రియను ఆరా తీశారు.