
IIT బాంబే విద్యార్థులు చేసిన పని రచ్చకెక్కింది. చినికి చినికి గాలి వానగా మారినట్టు క్యాంపస్ వివాదం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే.. మార్చి 31, 2024 నాడు బాంబే ఐఐటీలో యాన్యువల్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులంతా తమ కళను ప్రదర్శించారు.
కొందరు డ్యాన్ చేస్తే మరికొందరు స్కిట్ చేస్తూ అందరిని ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఐఐటీ విద్యార్థులు ఎనిమిది మంది రామాయణం ఆధారంగా ఓ నాటకం ప్రదర్శించారు. దాంట్లో స్త్రీ యొక్క గొప్పతనాన్ని చాటిచెపుదామని అనుకున్నారు.. కానీ అది వారికే రివర్స్ అయ్యింది. స్త్రీ యొక్క గౌరవం చూపెడుదామని అనుకున్న వారికి.. రామాయణాన్ని అవమానించారు అని అనుకునేలా వెళ్లింది.
నాటక ప్రదర్శనల వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. రామాయణం ఆధారంగా స్త్రీ విలువను చూపెట్టక పోయి రామాయణాన్నే అవమానించేలా నాటకం చేశారని విమర్శలు పొందారు. దీనిపై నెటిజన్స్ కోపంగా స్పందించారు. స్త్రీవాదాన్ని చూపించే పేరుతో విద్యార్థులు సంస్కృతిని అపహాస్యం చేశారని కామెంట్ చేశారు.
విద్యార్థులు తమ విద్యా స్వేచ్ఛను దుర్వినియోగం చేశారని, భవిష్యత్తులో క్యాంపస్‌లో భావప్రకటనా స్వేచ్ఛ ముసుగులో.. ఏ మతాన్ని అవహేళన చేయకుండా ఉండేలా ఇన్‌స్టిట్యూట్ మార్గ దర్శకాలను రూపొందించాలని సూచించారు. బాంబే ఐఐటీకి అందిన పలు ఫిర్యాదుల ఆధారంగా ఐఐటీ సీరియస్ యాక్షన్ తీసుకుంది. విద్యార్థులకు ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఒక లక్షా 20 వేల రూపాయల ఫైన్ వేశారు.