
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తుంది.. థర్డ్ వేవ్ కూడా వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు అన్ని విధాల సిద్ధంగా ఉందామని..భవిష్యత్ తరాలను రక్షించుకుందామని ట్వీట్ చేశారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపిస్తుందని..వైద్య నిపుణులు, శాస్త్ర వేత్తలు హెచ్చరిస్తున్నందున..ఇప్పటి నుంచే అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. థర్డ్ వేవ్ విషయంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దేశంలో పిల్లల తల్లి తండ్రులకు వెంటనే కరోనో వాక్సిన్స్ వేయించాలన్నారు. పిల్లల వ్యాధులకు సంబంధించిన మందుల ఉత్పత్తులను గణనీయంగా పెంచి..మందుల కొరత లేకుండా చూడాలన్నారు. అలాగే దేశంలో వైద్య సిబ్బందిని సరిపోయేంతగా పెంచాలని, నర్సింగ్ సిబ్బందిని పెంచి వారికి సరైన శిక్షణ, నైపుణ్యం ఇవ్వాలన్నారు.
In the third wave,if it affects children,we need to be prepared
— Revanth Reddy (@revanth_anumula) May 18, 2021
?All parents should be vaccinated
?Increase production of paediatric medication
?Nursing staff needs to be increased and trained
?Medical facilities need to be improved to suit children
Let’s save our”Future” https://t.co/BgL8oeD3fA