అవి ఇళ్లా.. డబ్బుల గోదాములా..! : ఐటీ రైడ్స్ లో రూ.102 కోట్లు పట్టివేత

అవి ఇళ్లా.. డబ్బుల గోదాములా..! : ఐటీ రైడ్స్ లో రూ.102 కోట్లు పట్టివేత

ఇల్లంటే ఫర్నింగ్ ఉంటుంది.. వంట సామాను ఉంటుంది.. అదే గోదాంలు అయితే వస్తువులు ఉంటాయి.. ఇప్పుడు వెలుగు చూస్తున్న ఘటనలు మాత్రం దేశం మొత్తాన్ని షాక్ కు గురి చేస్తున్నాయి. గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు.. డబ్బుల కట్టలు బయటపడుతున్నాయి. నాలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణ, కర్నాటక, ఢిల్లీలో 55 చోట్ల.. ఇన్ కం ట్యాక్స్ అధికారులు చేసిన దాడుల్లో.. 48 గంటల్లోనే.. 102 కోట్ల రూపాయల విలువైన డబ్బు, బంగారం, వజ్రాలు బయటపడటం సంచలనంగా మారింది. వెయ్యి రూపాయల కోసం సామాన్యులు నానా తప్పలు పడుతుంటే.. వీళ్ల దగ్గర గోదాల కొద్దీ డబ్బు ఎలా దొరకుతుంది అనే ప్రశ్న ఇప్పుడు సామాన్యుల్లో వ్యక్తం అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

Also Read : ధరణితో లక్షల ఎకరాలు మాయం.. : బీఆర్ఎస్ కారు.. బేకార్ : రాజ్ నాథ్ సింగ్

2023 అక్టోబర్ 12న దేశవ్యాప్తంగా55 ప్రదేశాల్లో  విస్తృతమైన సోదాలు చేశారు  ఆదాయపు పన్ను శాఖ అధికారులు .  ఈ సోదాల్లో 102 కోట్ల విలువైన నగదు, బంగారం, వజ్రాభరణాలు, విలాసవంతమైన గడియారాలు సహా గణనీయమైన ఆస్తులను ఆదాయపు పన్ను శాఖ జప్తు చేసింది. కర్ణాటకతో సహా అనేక ఇతర రాష్ట్రాల్లోని  ప్రభుత్వ కాంట్రాక్టర్లు,  రియల్ ఎస్టేట్ డెవలపర్ల ఇళ్లపై సోదాలు జరిగాయి.  ఈ సోదాల్లో సుమారుగా 30 అత్యాధునిక విదేశీ లగ్జరీ గడియారాలు దొరికాయి.  వ్యాపారంతో సంబంధం లేని  ఓ  ప్రైవేట్ జీతం పొందే ఉద్యోగి వద్ద ఈ గడియారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  ఈవిషయాలను  సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఒక ప్రకటనలో వెల్లడించింది.