తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

దేశంలో నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 13,086 కేసులు వెలుగులోకి వచ్చాయి.  నిన్నటితో పోలిస్తే 18శాతం తక్కువ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 4,35,18,564 కు చేరుకుంది. అటు కరోనాతో మరో 24మంది మృతి చెందారు. దీనితో మరణాల సంఖ్య 5,25,247 కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో12,456  మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా ప్రస్తుతం దేశంలో 1,13,846 యాక్టివ్ కేసులున్నా యి.  ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 2.90శాతంగా ఉంది. ఈ మేరకు కేంద్ర  వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసింది.