కుల మతాలు, ప్రాంతాలకు అతీతంగా వజ్రోత్సవాలు

కుల మతాలు, ప్రాంతాలకు అతీతంగా వజ్రోత్సవాలు

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కుల మతాలు, భాషలు, ప్రాంతాలకు అతీతంగా ఆజాదీకా అమృతోత్సవ వేడుకలు  ఘనంగా జరుపుకుంటున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశ సమైక్యతను చాటే ఈ ఉత్సవాలు స్ఫూర్తిదాయకం అని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా  దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని తన నివాసంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధులు, అమరవీరులకు నివాళులర్పించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. 

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో వందేళ్ల స్వాతంత్ర్య పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రపంచమంతా భారత స్వాతంత్ర వేడుకలు జరుగుతుండడం సంతోషకరం అన్నారు. రానున్న రోజుల్లో వందేళ్ల వేడుకలు జరుగుతాయని.. ఆలోగా దేశాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుని.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా నిర్మాణం చేసుకోవాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు.