భారత వైమానిక దళ విన్యాసాల్లో పాల్గొన్న ఫ్రెంచ్

భారత వైమానిక దళ విన్యాసాల్లో పాల్గొన్న ఫ్రెంచ్

రాజస్థాన్ జోధ్ పూర్ లో భారత వైమానిక దళం విన్యాసం ఆకట్టుకుంది. గతవారం రోజుల నుంచి కొనసాగుతున్న విన్యాసాల్లో ఫ్రెంచ్ వైమానిక దళం పాల్గొంది. ఇరు దేశాలు జాయింట్ ఎక్సర్ సైజ్ నిర్వహించాయి. రెండు దేశాలు తమ వైమానిక శక్తిని ప్రదర్శించాయి. ఇండియాకు చెందిన ఐదు రఫెల్, ఐదు సుఖోయ్, మూడు తేజస్ యుద్ధవిమానాలు విన్యాసాల్లో పాల్గొన్నాయి. ఆకాశంలో ఇంధనం నింపుకునే విన్యాసాలను ఇరుదేశాలు నిర్వహించాయి. కసరత్తులో భారత వైమానిక దళ చీఫ్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరి రాఫెల్ విమానాన్ని నడపగా.. ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ జనరల్ స్టీఫెన్ సుఖైలో ప్రయాణించారు. 



నిన్న ఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ లో ఇరు దేశాల చీఫ్ లు సమావేశమయ్యారు. ఇరుదేశాల విన్యాసాలు, పరస్పర సహకారం గురించి చర్చించుకున్నారు. గరుడ ఎక్సర్ సైజ్ లో ఇరు దేశాల అధినేతలు యుద్ధవిమానాలు నడపడం రెండోసారి అంటున్నారు అధికారులు. గరుడు సిరీస్ లోని మొదటి ఆరు విన్యాసాలు రెండు దేశాల వైమానిక దళం మధ్య జరిగాయి. ఫ్రెంచ్ వైమానిక దళం 220 మంది సిబ్బందితో జోధ్ పూర్ లో విన్యాసాలు నిర్వహిస్తోంది. ఈ కసరత్తు నవంబర్ 12 వరకు కొనసాగనుంది.