
సాధారణంగా రైలులో ప్రతిరోజు కోట్ల మంది ప్రయాణిస్తుంటారు. అయితే నిత్యం రద్దీగా ఉండే రైళ్లలో ప్రయాణికుల భద్రత పై భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు చర్యలు తీసికుకుంటూనే ఉంటుంది. అయితే రైల్వే ప్రయాణీకుల భద్రత దృష్టిలో పెట్టుకొని భారత రైల్వేలు మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పుడు రైలులోని అన్ని కోచ్‌లలో CCTV కెమెరాలను ఏర్పాటు చేయాలని రైల్వేలు నిర్ణయించాయి. దింతో రైళ్లలో దొంగతనాలు, దాడులు అరికట్టవచ్చు అంతేకాదు ఇలాంటి సంఘటనలు కూడా తగ్గుతాయి. ప్రయాణీకుల గోప్యత కాపాడటానికి ప్రతి భోగి తలుపుల దగ్గర ఈ CCTV కెమెరాలను ఏర్పాటు చేస్తారు.
ఇందుకు భారతీయ రైల్వేలు మొత్తం 74,000 ప్యాసింజర్ కోచ్‌లు, 15,000 ఇంజిన్‌లలో CCTV కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది. ఈ ప్లాన్ ఎప్పుడు మొదలుపెడతారో తెలియనప్పటికీ, ప్రతి కోచ్‌కి 4 డోమ్ CCTV కెమెరాలు (ప్రతి భోగి డోర్ వద్ద 2), ప్రతి ఇంజిన్‌లో 6 CCTV కెమెరాలు ఉంటాయని చెప్పింది. ఇంజిన్ లోపల, ఇంజిన్ ముందు, వెనుక ఇంకా రెండు వైపులా ఒక్కొక్క కెమెరా ఉంటుంది.
కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు CCTV ట్రయల్స్ సమీక్షించారు, ఆ తర్వాత ప్యాసింజర్ కోచ్‌ల నెట్‌వర్క్ మొత్తానికి అమలు చేయాలని నిర్ణయించారు. రైళ్లు గంటకు 100 కి.మీ కంటే ఎక్కువ స్పీడుతో వెళ్తున్న అలాగే తక్కువ వెలుతురులో కూడా అధిక-నాణ్యత ఫుటేజ్ రికార్డ్ చేయడానికి మంచి వ్యూతో CCTV కెమెరాలను ఏర్పాటు చేయాలని రైల్వేలు భావిస్తున్నాయి. ఇండియా AI మిషన్ సహకారంతో CCTV కెమెరాల ద్వారా రికార్డ్ చేసిన డేటాపై కృత్రిమ మేధస్సు (AI) వాడకాన్ని కూడా రైల్వేలు ఉపయోగించొచ్చు.
Also Read : మా రాష్ట్రం.. మా చదువు.. మీ హిందీ మాకెందుకు
సాధారణ ప్రయాణికుల పై దాడులు, దొంగతనాలు, దోపిడీ ముఠాలు దోచుకుంటున్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కెమెరాల ఏర్పాటు వల్ల ఇలాంటి సంఘటనలు చాలా వరకు తగ్గుతాయి. ప్రయాణీకులను కాపాడటానికి ప్రతి భోగి తలుపుల దగ్గర అంటే సాధారణ కదలిక ప్రాంతంలో ఈ CCTV కెమెరాలను ఏర్పాటు చేస్తారు.