మా రాష్ట్రం.. మా చదువు.. మీ హిందీ మాకెందుకు: మాపిల్లలు తమిళం, ఇంగ్లీషే చదువుతారంటున్న స్టాలిన్

మా రాష్ట్రం.. మా చదువు.. మీ హిందీ మాకెందుకు: మాపిల్లలు తమిళం, ఇంగ్లీషే చదువుతారంటున్న స్టాలిన్

జాతీయ విద్యావిధానాన్ని(NEP) తమిళనాడు ప్రభుత్వం తిరస్కరించింది. శుక్రవారం(ఆగస్టు 8) చెన్నైలో కొత్త రాష్ట్ర విద్యావిధానాన్ని(SEP) సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. మూడు భాషలు వద్దు.. రెండు భాషలే ముద్దు..మా పిల్లలు ఇంగ్లీషు, తమిళం మాత్రమే చదువుతారని స్టాలిన్ ఈ విద్యావిధానం ద్వారా స్పష్టం చేశారు.

విద్యను ఉమ్మడి జాబితా నుంచి రాష్ట్ర జాబితాకు మార్చాలని తద్వారా విద్యా విధానాన్ని రూపొందించడంలో ఎక్కువ రాష్ట్ర స్వయంప్రతిపత్తి కోసం వాదించాలని ఈ విధానం సిఫార్సు చేస్తుంది. జాతీయ విధానానికి ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రత్యేక విద్యా ప్రాధాన్యతలు, దార్శనికత ప్రతిబింబించేలా కొత్తగా SEPని రూపొందించారు. 

2022లో SEPను రూపొందించేందుకు రిటైర్డ్ జస్టిస్ డి. మురుగేశన్ నేతృత్వంలో 14 మంది సభ్యుల కమిటీని నియమించారు. నెలల తరబడి సమీక్ష తర్వాత కమిటీ జూలై 2024లో సీఎం MK స్టాలిన్‌కు సిఫార్సులను సమర్పించింది. తుది పత్రం ఇప్పుడు అధికారికంగా విడుదల చేశారు. 

Also Read : గిఫ్ట్గా రూ.2లక్షల విలువైన ఐఫోన్లు!

ఈ విద్యా విధానం ద్వారా విద్యార్థులు కేవలం చదువుకోకుండా ఆలోచించి విద్యను అభ్యసించాలని మేం కోరుకుంటున్నామన్నారు సీఎం స్టాలిన్. అధ్యయనాలతో పాటు శారీరక విద్యను కూడా బోధిస్తామన్నారు. ముఖ్యంగా రెండు రెండు భాషల విధానాన్ని అనుసరిస్తామని స్పష్టం చేశారు. అది మా దృఢమైన విధానం అన్నారు. 

కొత్తగా ఆవిష్కరించబడిన రాష్ట్ర విద్యా విధానం (SEP) అన్ని పాఠశాలల్లో స్మార్ట్ తరగతులను ప్రవేశపెడుతుందన్నా సీఎం స్టాలిన్. 100శాతం ఉన్నతస్థాయి చదువులకు  పాఠశాల విద్యార్థులను పెంచాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని స్టాలిన్ నొక్కి చెప్పారు.

3, 5, 8 తరగతులలో పబ్లిక్ పరీక్షలను ప్రవేశపెట్టాలనే NEP ప్రతిపాదనను SEP తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ చర్యను తిరోగమన చర్యగా, సామాజిక వ్యతిరేక న్యాయంగా ,విద్యను వ్యాపారంగా ప్రోత్సహిస్తూ డ్రాపౌట్ రేట్లను పెంచే అవకాశం ఉందని SEP విమర్శించింది.

రాష్ట్ర విద్యా విధానం (SEP) తమిళనాడు ద్విభాషా వ్యవస్థను అనుసరిస్తుందని మరోసారి స్పష్టం చేసింది. జాతీయ విద్యా విధానం (NEP)లో పేర్కొన్న త్రిభాషా సూత్రాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది.  అదనంగా కళలు ,సైన్స్ కార్యక్రమాలకు అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్లు ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా కాకుండా 11 ,12 తరగతుల మిశ్రమ మార్కుల ఆధారంగా ఉండాలని SEP ప్రతిపాదించింది.

శుక్రవారం చెన్నైలోని కొత్తూరుపురంలోని అన్నా సెంటెనరీ లైబ్రరీ ఆడిటోరియంలో రాష్ట్ర విద్యా విధానం (SEP)ని ప్రారంభించారు సీఎం స్టాలిన్. రాష్ట్ర ప్రత్యేక విద్యా ప్రాధాన్యతలు ,దార్శనికతను ప్రతిబింబించేలా జాతీయ విద్యా విధానం (NEP)కి ప్రత్యామ్నాయంగా కొత్తగా ప్రవేశపెట్టబడిన SEPని రూపొందించారు.