
ఢిల్లీ సర్కార్..ఎమ్మెల్యేలకు బంపర్ ఆఫర్..ప్రతిపక్షాలతో సహా అందరికి ఈ ఆఫర్ వర్తిస్తుంది.. మొత్తం70 ఎమ్మెల్యేలకు ఉచితంగా ఐఫోన్లను అందించింది ఢిల్లీ ప్రభుత్వం..ఈ ఐఫోన్లను ఎందుకు ఎమ్మెల్యేలకు ఎందుకు ఉచితంగా ఇచ్చింది.. దాని వెనకాల కథేంటో వివరాల్లోకి వెళితే..
ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల శాసనసభ్యులందరికీ సరికొత్త ఐఫోన్ 16 ప్రో ఐఫోన్లను అందించింది. ప్రతిపక్షాలతో సహా ఎమ్మెల్యేలందరికి ఈ ఐఫోన్లు అందచేశారు. ఈ టెక్ డ్రైవ్ నేషనల్ ఈ-విధాన్ అప్లికేషన్ (NeVA) అమలు ప్రక్రియలో భాగంగా అందచేశారు. కాగితాలతో పనిలేకుండా శాసన సభను నిర్వహించాలని కేంద్రప్రభుత్వం చేపట్టిన కాగిత రహిత పాలన లక్ష్యంగా ఢిల్లీ ప్రభుత్వం ఈ టెక్నాలజీ అప్ గ్రేడ్ను చేపట్టింది.
Also Read : గోవా వెళ్లే పర్యాటకులకి గుడ్ న్యూస్
ఢిల్లీలో ప్రభుత్వం దీనిని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచించింది. ఇందులో భాంగా ఈ ఐఫోన్లను ఎమ్మెల్యేలందరికి అందిజేశారు. వీటిని కేవలం అధికారికి కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని షరతు పెట్టింది. ఇందులో NeVA యాప్ ముందుగానే ఇన్ స్టాల్ చేసి, సభ్యులకు శిక్షణ ఇస్తారు.
NeVA ఉపయోగాలు:
- శాసనసభ కార్యకలాపాల డిజిటలైజేషన్
- బిల్లులు, ప్రశ్నోత్తరాలు, నోటిఫికేషన్లు మాన్యువల్ కాపీలను తొలగించడం
- సభ్యులకు సులభమైన యాక్సెస్
- ట్రాన్స్‌పరెన్సీ, సమయపు పొదుపు
- పర్యావరణ హితంగా ఉండే వ్యవస్థ
ఐఫోన్లను దేనికి వినియోగించాలి..?
ఐఫోన్ 16 ప్రో లాంటి అడ్వాన్స్ డ్ డివైజ్ ద్వారా సభ్యులు సులభంగా NeVA యాప్‌ను ఉపయోగించగలుగుతారు
ఇది సైబర్ భద్రత పరంగా మరింత సురక్షితంగా ఉండేలా చూస్తోంది
సభ్యుల అధికారిక డాక్యుమెంట్లు, నోట్స్ అన్నీ డిజిటల్ రూపంలోనూ ఉంటాయి
అయితే ఐఫోన్లు పంపిణీపై భిన్నాప్రాయాలున్నాయి. కొంతమంది శాసనసభ్యులు ఈ చర్యను స్వాగతించగా మరికొంత మంది ఖర్చుపై ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు. “ఇది ప్రజాధనం వినియోగంలో పారదర్శకత ఉండేలా చూసుకోవాలి, అని ప్రతిపక్ష నేతలు అంటున్నారు.
ఎంత ఖర్చవుతుంది..
- ఒక్కో ఐఫోన్ 16 ప్రో ధర సుమారు రూ.1.50 లక్షలు ఉంది.
- ఫోన్లను ప్రభుత్వ ఆస్తిగా నమోదు చేసి, సభ్యులు అధికారిక ఉపయోగం కోసమే వాడాల్సి ఉంది.
ఇది కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం కాకుండా NeVA చొరవ దేశవ్యాప్తంగా అమలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు దీనిని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి.