
ఖమ్మం రూరల్, వెలుగు: ఖమ్మం రూరల్ మండలంలోని బారుగూడెం, చిన్న వెంకటగిరి గుడిమల్ల, గుర్రాలపాడు, గొల్లగూడెం, ఏదులాపురం, మద్దులపల్లి, ముత్తగూడెం, పెద్దతండా తెల్లారుపల్లి, పల్లెగూడెం పార్ట్ (రెడ్డిపల్లి), పోలేపల్లితో కలిపి ఏదులాపురం పేరుతో ప్రభుత్వం కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు చేసింది.
కాగా మున్సిపాలిటీలో 32 వార్డులను విభజించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ను మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి మంగళవారం విడుదల చేశారు. మున్సిపాలిటీ మ్యాప్ కూడా విడుదల చేశారు. విభజనపై అభ్యంతరాలు ఉంటే నేటి నుంచి ఏడు రోజుల్లో తెలియజేయాలని మున్సిపల్ కమిషనర్ కోరారు. 19న డ్రాప్ట్ నోటిఫికేషన్ అప్రూవల్ కోసం రాష్ట్ర మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ కు పంపుతామన్నారు.