భారత వెబ్సైట్లపై మలేషియా హ్యాకర్ల దాడి

భారత వెబ్సైట్లపై మలేషియా హ్యాకర్ల దాడి

నుపుర్ శర్మ  ఇటీవల చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ భారత వెబ్సైట్లపై  మలేషియా హ్యాకర్లు సైబర్ దాడికి తెగబడ్డారు. 70కిపైగా ప్రభుత్వ, ప్రైవేటు వెబ్సైట్ల హ్యాకింగ్ కు యత్నించినట్లు సమాచారం. ‘డ్రాగన్ ఫోర్స్’ అనే మలేషియా హ్యాకర్ల గ్రూప్ ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు గుర్తించారు. ఇజ్రాయెల్ లోని భారత ఎంబసీ, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ మేనేజ్మెంట్, నాగ్పూర్ లోని  ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లకు చెందిన  వెబ్సైట్లు హ్యాకింగ్కు గురయ్యాయి. ‘ఓప్స్ పాటుక్’ (స్ట్రైక్ బ్యాక్) పేరుతో ‘డ్రాగన్ ఫోర్స్’ హ్యాకర్లు  ఈ సైబర్ దాడులకు పాల్పడ్డారు. మలేషియా కేంద్రంగా పనిచేసే ఈ హ్యాకర్ల  గ్రూప్ గతంలో పాలస్తీనాకు మద్దతు ఇజ్రాయెలీ  వెబ్సైట్లపైనా సైబర్ దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఇది మలేషియా, పాక్ ప్రభుత్వాలతోనూ కలిసి పని చేసిన దాఖలాలు ఉన్నాయి.