నేడు ఐపీఎల్‌లో ఆసక్తికర సమరం.. ముంబైతో ఢిల్లీ ఢీ

నేడు ఐపీఎల్‌లో ఆసక్తికర సమరం.. ముంబైతో ఢిల్లీ ఢీ
  • ముంబై వర్సెస్ ఢిల్లీ మ్చాచ్‌లో పైచేయి ఎవరిదో

చెన్నై: ఐపీఎల్‌‌14లో మరో ఆసక్తికర సమరానికి తెరలేచింది. టాప్‌‌ టీమ్‌‌ ముంబై ఇండియన్స్‌‌, లాస్ట్‌‌ సీజన్‌‌తో పాటు ఈసారి కూడా అదరగొడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌‌ మంగళవారం ఇక్కడి చెపాక్‌‌ స్టేడియంలో పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్‌‌లో నెగ్గి పైచేయి సాధించాలని ఇరు జట్లూ టార్గెట్‌‌గా పెట్టుకున్నాయి. ఓటమితో కొత్త సీజన్‌‌ను షురూ చేసిన డిఫెండింగ్‌‌ చాంప్‌‌ ముంబై తర్వాతి రెండు మ్యాచ్‌‌ల్లో అద్భుత విజయాలు సాధించింది. వరుసగా మూడో విక్టరీపై కన్నేసిన ఆ టీమ్‌‌ మిడిలార్డర్‌‌లో కాస్త వీక్‌‌గా కనిపిస్తోంది. ఢిల్లీతో పోరులో ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని చూస్తోంది. మంచి ఆరంభాలను దక్కించుకుంటున్న కెప్టెన్ రోహిత్ శర్మ వాటిని భారీస్కోరుగా మార్చాలని చూస్తున్నాడు. మరో ఓపెనర్‌‌ డికాక్‌‌ కూడా ఇదే ఆలోచనతో ఉన్నాడు. సూర్యకుమార్‌‌, ఇషాన్‌‌ కిషన్‌‌, కీరన్‌‌ పొలార్డ్‌‌, హార్దిక్‌‌, క్రునాల్‌‌లతో బలమైన బ్యాటింగ్‌‌ ఆర్డర్‌‌ ఉన్నప్పటికీ.. ఇప్పటిదాకా ముంబై ఆ స్థాయిలో ఆడలేదు. మిడిల్‌‌ ఓవర్లలో  సత్తా చాటలేక నార్మల్‌‌ టార్గెట్‌‌కే పరిమితం అవుతోంది. వరుసగా మూడు మ్యాచ్‌‌ల్లో ఆ టీమ్‌‌ 159, 152, 150 స్కోర్లే చేసింది.  జస్‌‌ప్రీత్‌‌ బుమ్రా నేతృత్వంలోని బౌలింగ్ అటాక్‌‌ విజృంభించడంతో గత రెండు మ్యాచ్‌‌ల్లో చిన్న టార్గెట్లను కాపాడుకున్నా.. అన్ని సార్లూ అద్భుతాన్ని ఆశించలేం. బలమైన బ్యాటింగ్‌‌ ఆర్డర్‌‌ ఉన్న ఢిల్లీపై ఇలాంటి స్కోర్లతో ఫలితం ఉండదు కాబట్టి మిడిలార్డర్‌‌ ప్లేయర్లు బ్యాట్‌‌ఝుళిపించాల్సిన అవసరం ఉంది. బౌలింగ్‌‌లో ముంబైకి తిరుగులేదు. మరోవైపు గత మ్యాచ్‌‌లో పంజాబ్‌‌ కింగ్స్‌‌ ఇచ్చిన భారీ టార్గెట్‌‌ను ఈజీగా ఛేజ్‌‌ చేసిన ఢిల్లీ ఫుల్‌‌ జోష్‌‌లో ఉంది. ఓపెనర్​ ధవన్‌‌ బెస్ట్‌‌ ఫామ్‌‌లో ఉన్నాడు. అతని పాటు పృథ్వీ షా, కెప్టెన్‌‌ పంత్‌‌ కూడా టచ్‌‌లో ఉన్నారు. లాస్ట్‌‌ మ్యాచ్‌‌లో  బరిలోకి దిగిన స్టీవ్‌‌ స్మిత్‌‌ ఫెయిలయ్యాడు. కాబట్టి తిరిగి రహానెను తుది జట్టులోకి తెచ్చే చాన్సుంది. ఆల్‌‌రౌండర్లు స్టోయినిస్‌‌, లలిత్‌‌ యాదవ్‌‌ కూడా సత్తా చాటేందుకు రెడీగా ఉన్నారు. కగిసో రబాడ, క్రిస్‌‌ వోక్స్‌‌, అశ్విన్‌‌తో కూడిన బౌలింగ్‌‌ యూనిట్‌‌బలంగానే ఉంది. లాస్ట్‌‌ మ్యాచ్‌‌లో ఢిల్లీ.. నలుగురు పేసర్లతో ఆడింది. చెపాక్‌‌ వికెట్‌‌ స్పిన్‌‌కు అనుకూలిస్తున్న నేపథ్యంలో ముంబైపై సీనియర్‌‌ స్పిన్నర్‌‌ మిశ్రాను బరిలోకి దింపొచ్చు.