ఇక చంద్రుడిపైకి మనిషిని పంపిస్తాం.. తగ్గేదేలా అంటున్న ఇస్రో: సోమనాథ్

ఇక చంద్రుడిపైకి మనిషిని పంపిస్తాం.. తగ్గేదేలా అంటున్న ఇస్రో: సోమనాథ్

 దేశం కోసం స్ఫూర్తిదాయక  కార్యంద సాధించినందుకు గర్వంగా ఉందన్నారు ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్.  ఇది ఏ ఒక్కరి విజయం కాదని.. ఇస్రో శాస్త్రవేత్తల కృషి అని  కొనియాడారు. ప్రయోగం కోసం ఎంతో కష్టపడ్డామని.. తమ నాలుగేళ్ల కృషి ఫలించిందన్నారు.   తాము రాబోయే 14 రోజుల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు.   ఇస్రోకు మద్దతుగా నిలిచిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రయోగం సక్సెస్ కావాలంటూ కోరుకున్న ప్రతీ భారతీయుడికి ధన్యవాదాలు తెలిపారు.  

చంద్రయాన్ 3 కంటే పెద్ద లక్ష్యాలు తమ ముందున్నాయన్నారు సోమనాథ్. రోదసీలోకి మనిషిని పంపించడమే  తమ తొలి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.  త్వరలో శుక్రుడు, అంగారకుడిపై ప్రయోగాలు చేస్తామన్నారు.

చంద్రయాన్ 3 చరిత్ర సృష్టించింది. జాబిల్లిపై ఇప్పటి వరకు ఏ దేశం దిగని దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ కాలు మోపి మీసం మెలేసింది. సాయంత్రం 5.44 గంటలకు ల్యాండింగ్ ప్రక్రియ మొదలవ్వగా 6.04 గంటలకు  చంద్రయాన్ 3 చందమామను ముద్దాడింది. అంతరిక్షంలో భారత ప్రతిష్టను చాటిది . చంద్రుడిపై అడుగు పెట్టిన నాలుగో దేశంగా చరిత్ర సృష్టించింది ఇక ఇవాళ్టి నుంచి 14 రోజుల పాటు చందమామపై రోవర్ పరిశోధనలు  చేయనుంది.