- చంద్రయాన్ 2 రాడార్ ఇమేజెస్లో గుర్తించిన ఇస్రో
అహ్మదాబాద్: చంద్రుడి ఉపరితలంపై వాటర్ ఐస్, ఖనిజ నిక్షేపాలకు సంబంధించి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) కీలక సమాచారాన్ని సేకరించింది. 2019 నుంచీ చంద్రుడి చుట్టూ తిరుగుతున్న చంద్రయాన్ 2 ఆర్బిటర్ పంపిన రాడార్ చిత్రాలను అహ్మదాబాద్ లోని ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ సైంటిస్టులు తాజాగా విశ్లేషించి, డేటాను విడుదల చేశారు. చంద్రుడి ఉత్తర, దక్షిణ ధ్రువాలపై 80 డిగ్రీల నుంచి 90 డిగ్రీల అక్షాంశాల మధ్య ప్రాంతాల్లో గణనీయంగా వాటర్ ఐస్ ఉన్నట్టు గుర్తించినట్లు ప్రకటించారు.
మొత్తం 1,400 రాడార్ డేటాసెట్ లను తాము సేకరించామని, ఆ సమాచారం మొత్తాన్నీ సైంటిఫిక్ కమ్యూనిటీకి అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. చంద్రయాన్ 2 ఆర్బిటర్ లోని డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపెర్చర్ రాడార్ 25 మీటర్ల పిక్సెల్స్ రెసొల్యూషన్ తో చంద్రుడి ఉపరితలాన్ని ఫొటోలు తీసి పంపినట్టు పేర్కొన్నారు.
