చేత్తో తిన్నా ఎక్సర్​సైజే

చేత్తో తిన్నా ఎక్సర్​సైజే

హైజిన్​ పేరుతో చాలామంది చేత్తో తినడమే మానేశారు ఈ మధ్య. కానీ, శుభ్రత మాట అటుంచితే స్పూన్​తో తినడం వల్ల లేనిపోని తిప్పలు వచ్చిపడతాయి. అందుకే ‘ఇకనుండైనా  కాస్త చేతికి పనిచెప్పండి’ అంటున్నారు న్యూట్రిషనిస్ట్​ యశ్న.  అంతేనా చేత్తో తినడం వల్ల కలిగే లాభాలు కూడా చెప్తోంది. చేత్తో తింటే అది ‘మైండ్​ ఫుడ్​ ఈటింగ్’ అవుతుంది. తినే ఫుడ్​పై కాన్సన్​ట్రేషన్​ ఉంటుంది. ఎంత తింటున్నామన్న లెక్క ఉంటుంది. పైగా కాస్త మెల్లిగా తింటాం. వీటివల్ల కొంచెం తిన్నా కూడా కడుపు నిండిన ఫీలింగ్​ వస్తుంది. అదే స్పూన్​తో తింటే ఎంత తిన్నా తిన్నట్టే అనిపించదు. ఎంత టేస్టీ వంటకమైనా తిన్న సాటిస్​ ఫాక్షన్​  ఉండదు. దాంతో తినే క్వాంటిటీ ఎక్కువై, బరువూ పెరుగుతారు.  చేత్తో తినడం వల్ల టైప్​– 2 డయాబెటిస్​  నుంచి తప్పించుకోవచ్చు. అదెలాగంటే..చాలామంది కుదురుగా కూర్చొని తినే  టైం లేక స్పూన్​తో గబగబా తింటుంటారు. దానివల్ల బ్లడ్​ షుగర్​ లెవల్స్​లో తేడా వచ్చి టైప్​ –2 డయాబెటిస్​ వచ్చే అవకాశం ఉంది. టైప్​– 2 డయాబెటిస్​తో బాధపడేవాళ్లలో ఎక్కువ మంది స్పూన్​తో తినే అలవాటున్నవాళ్లేనని చాలా స్టడీల్లో తేలింది. 
చేత్తో తింటే అరుగుదల సమస్యలు కూడా రావు. అన్నం లేదా ఇతర ఫుడ్​ ఐటెమ్స్​ చేత్తో పట్టుకున్నప్పుడు తినడానికి రెడీ అని బ్రెయిన్​ పొట్టకి సిగ్నల్స్​ పంపిస్తుంది. దానివల్ల  తిన్న ఫుడ్​ త్వరగా అరిగిపోతుంది. కానీ, స్పూన్​తో తినడం వల్ల బ్రెయిన్​ నుంచి పొట్టకి ఆ సిగ్నల్స్​ వెళ్లవు. 

చేతి వేళ్లపై  ‘నార్మల్​  ఫ్లోరా’  అనే బ్యాక్టీరియా ఉంటుంది. దీనివల్ల ఆరోగ్యానికి ఎలాంటి నష్టం ఉండదు. పైగా బయటి నుంచి శరీరంలోకి వచ్చే హానికర బ్యాక్టీరియాలని అడ్డుకుంటుంది. అందుకే ఈ బ్యాక్టీరియాని నోరు, గొంతు, డైజేషన్​ ట్రాక్​, చిన్న పేగులలో వృద్ధి చేసుకోవడం చాలా అవసరం. అందుకు ఏవేవో ప్రయత్నాలు చేయక్కర్లేదు సింపుల్​గా  చేత్తో అన్నం తింటే చాలు. స్పూన్​, ఫోర్క్​తో తినడం వల్ల ఫుడ్​ క్వాలిటీ, టెంపరేచర్​ తెలియదు. కానీ, చేత్తో తింటే ఫుడ్​ చల్లగా ఉన్నా, మరీ వేడిగా ఉన్నా వెంటనే తెలుస్తుంది. చేత్తో పెట్టుకోవడం వల్ల ఫుడ్​ టెక్శ్చర్,  స్మెల్​ కూడా తెలుస్తాయి. దానివల్ల ఫుడ్​ పాయిజనింగ్​ నుంచి తప్పించుకోవచ్చు.చేత్తో తినడం కూడా ఒక ఎక్సర్​సైజ్. చేత్తో ఫుడ్​ కలిపి, తినడం వల్ల కండరాలు బలపడతాయి. దానివల్ల బ్లడ్​ సర్క్యులేషన్​ పెరిగి బాడీ ఫిట్​గా ఉంటుంది. ఈ లాభాలన్నీ  కావాలంటే చేతుల్ని శుభ్రంగా కడుక్కుని తినాల్సిందే అంటున్నారు  ఈ న్యూట్రిషనిస్ట్​.