ట్విట్టర్ నూతన సీఈవోగా బాధ్యతలు చేపట్టిన లిండా యక్కరినో

ట్విట్టర్ నూతన సీఈవోగా బాధ్యతలు చేపట్టిన లిండా యక్కరినో

ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్ నూతన సీఈవోగా లిండా యక్కరినో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా లిండా తన లింక్డ్ఇన్ ఎకౌంట్లో బయో వివరాలను అప్డేట్ చేసి, తన బయోలో ట్విట్టర్ సిఈఓ అని పేర్కొన్నారు. అంతే కాకుండా తాను ట్విటర్ సీఈఓ గా బాధ్యతలు స్వీకరించినట్టు లిండా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

ట్విట్టర్ భవిష్యత్తు గురించి తాను పాటుపడడానికి ఎలాన్ మస్క్ నుంచి ప్రేరణ పొందినట్టుగా లిండా యక్కరినో వెల్లడించారు. ఎలాన్ మస్క్ దూరదృష్టి తనను ఎంతో ఆకర్షించిందన్న ఆమె. ట్విట్టర్ ను అభివృద్ధి బాటలో నడపడానికి తాను ఎంతో ఉత్సాహంగా ఉన్నానని తెలిపారు. లిండా ఇంతకుముందు ఎన్బీసీ యూనివర్సల్ కి ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు.
https://twitter.com/lindayacc/status/1665920872627208193