35 చిన్న కథ కాదు కథలో కమర్షియల్ హంగులు లేవన్నారు.

35 చిన్న కథ కాదు కథలో కమర్షియల్ హంగులు లేవన్నారు.

ఇటీవల ప్రకటించిన 72వ నేషనల్ ఫిలిం అవార్డ్స్‌‌‌‌లో ఉత్తమ బాలల చిత్రం, ఉత్తమ బాల నటుడు విభాగాల్లో రెండు అవార్డ్స్ గెల్చుకుంది  ‘35 చిన్న కథ కాదు’ సినిమా.  ఈ చిత్రంలోని నటనకు ఉత్తమ బాల నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్నాడు  మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల. తను ప్రస్తుతం ‘సమ్మర్ హాలీడేస్’ అనే  బాలల చిత్రంలో నటిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో  ‘35 చిన్న కథ కాదు’  మూవీ టీమ్‌‌‌‌ను ‘సమ్మర్ హాలీడేస్’ సినిమా టీమ్ సన్మానించారు.  ఈ సందర్భంగా దర్శకుడు నందకిషోర్ మాట్లాడుతూ ‘గుణశేఖర్ గారు తీసిన ‘బాల రామాయణం’ తర్వాత ఇన్నేళ్లకు తెలుగులో --మా చిత్రానికి ఈ అరుదైన గౌరవం దక్కడం గర్వంగా ఉంది.  

కమర్షియల్ హంగులు లేవంటూ చాలామంది సందేహించిన ఈ కథను నమ్మిన మా నిర్మాతలకు థ్యాంక్స్‌‌‌‌. వాళ్లు ముందుకు రాకపోయుంటే ఇప్పుడిలా జాతీయ అవార్డులు వచ్చేవి కావు.  ఈ ప్రయాణంలో మమ్మల్ని గుర్తించిన భారత ప్రభుత్వానికి, జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు’ అని చెప్పారు.   నటులు ప్రియదర్శి, విశ్వదేవ్, మాస్టర్ అరుణ్ దేవ్ తమ ఆనందాన్ని పంచుకోగా, "సమ్మర్ హాలిడేస్" నిర్మాత ధీరజ్ మొగిలినేని, దర్శకుడు శ్రీకర్, సంగీత దర్శకుడు సింజిత్ యెర్రమల్లి ‘35 చిన్న కథ కాదు’  టీమ్ కృషిని ప్రశంసించారు.