
దేశంలో కొత్త కొత్త 5జీ ఫోన్లో లాంఛ్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా దాదాపు 15 వేల వరకు ఉంటున్నాయి. అయితే వినియోగదారులకు అతి తక్కువలో 5జీ ఫోన్ ను అందించాలన్న ఉద్దేశంలో ఐటెల్ కంపెనీ ఓ 5జీ ఫోన్ ను లాంఛ్ చేసింది. ఐటెల్ పీ55 పేరుతో 5జీ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది దేశంలోనే అత్యంత చవకైన 5జీ ఫోన్ గా ప్రకటించింది.
ఐటెల్ పీ 55 5 జీ స్మార్ట్ ఫోన్ ఆక్టా-కోర్ డైమెన్సిటీ చిప్‌సెట్ ను కలిగింది. వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఇది మద్దతు ఇస్తుంది. ఏఐ పవర్డ్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కూడా కలిగి ఉంది. రెండు రంగుల్లో ఇది లభిస్తుంది.
ఐటెల్ పీ 55 5జీ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర
ఐటెల్ పీ55 5జీ ఫోన్ బ్లూ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తోంది. 8జీబీ+ 128జీబీ వేరియంట్ లో ఇది అందుబాటులో ఉంది. దీని ధర రూ. 9,999గా ఉంది. ఈ ఫోన్ అక్టోబర్ 4 నుంచి ఈ కామర్స్ సైట్ అమెజాన్ లో లభించనుంది.
ALSO READ: రూ.90 వేలకే హోండా స్పోర్ట్స్ బైక్
ఐటెల్ పీ55 5జీ స్మార్ట్ ఫోన్ 6.6-అంగుళాల హెచ్ డీ ప్లస్(1600 x 700 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. డ్యూయల్ నానో సిమ్ స్లాట్స్ ఉంటాయి. 90హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది. 8జీబీ ర్యామ్,128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ARM మాలి జీ 57 MC2 GPUతో కూడిని ఆక్టా కోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 6080 SOCసీ ద్వారా అందించబడుతుంది. ఇది మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 256GB వరకు విస్తరించవచ్చు. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా ఈ ఫోన్ పనిచేస్తుంది.
ఐటెల్ పీ55 5జీ స్మార్ట్ ఫోన్ వెనుక వైపు 50 MP ప్రైమరీ కెమెరాతో పాటు LED ఫ్లాష్ లైట్ ఉంటుంది. సెకండరీ ఏఐ కెమెరాను కలిగి ఉంటుంది. ముందు కెమెరా 8MPల్ సెన్సార్ ఉంటుంది. ఫోన్ 18వాట్ల వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000MAH బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగింది. ఐటెల్ పీ55 5జీ స్మార్ట్ ఫోన్ కు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. 3.5ఎంఎం ఆడియో జాక్ కలిగి ఉంది. ఇది 5జీ, 4జీ వోల్ట్, వైఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, యూఎస్బీ టైప్-సి కనెక్టివిటీని అందిస్తుంది.