- జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్
కోరుట్ల, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన విద్యాబోధన చేయాలని, అప్పుడే విద్యార్థుల భవిష్యత్ బాగుంటుందని -జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్అన్నారు. శుక్రవారం కథలాపూర్ మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్‌ను సందర్శించారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్య పట్ల శ్రద్ధ చూపాలని టీచర్లకు సూచించారు. అనంతరం కిచెన్, వంట సరుకుల నాణ్యత, స్టోర్ రూంలో బియ్యం నాణ్యతను పరిశీలించారు. మెనూ ప్రకారం శుభ్రమైన ఆహారం విద్యార్థులకు అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఖాళీ స్థలంలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
భూ భారతి దరఖాస్తులను పరిష్కరించాలి
కథలాపూర్ తహసీల్ ఆఫీస్‌ను కలెక్టర్తనిఖీ చేశారు. రెవెన్యూ రికార్డులను పరిశీలించి భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యం చేయొద్దని సూచించారు. ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి, ఎంత మందికి నోటీసులు ఇచ్చారు, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయ్యిందా తదితర వివరాలను తహసీల్దార్‌ను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం దుంపేట గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. మొదటి విడతలో ప్రారంభించిన ఇండ్లను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో జీవాకర్ రెడ్డి, డీఈవో రాము, తహసీల్దార్ వినోద్ కుమార్, ఎంపీడీవో శంకర్, అధికారులు
ఉన్నారు.
వెనుకబడిన విద్యార్థుల శ్రద్ధ పెట్టాలి
జగిత్యాల టౌన్, వెలుగు: టెన్త్ స్టూడెంట్స్ వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఎంఈవోలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అడిషనల్ కలెక్టర్ రాజగౌడ్, డీఈవో రాముతో కలిసి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కు ప్రభుత్వం ఆదేశాల మేరకు సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. జిల్లాలో 7,289 మంది టెన్త్ పరీక్షలు రాయబోతున్నట్లు తెలిపారు.
