జగిత్యాల జిల్లా : నన్ను గెలిపిస్తే రూ. 10 లక్షల విరాళమిస్తా..బాండ్‌‌‌‌‌‌‌‌, చెక్‌‌‌‌‌‌‌‌తో ఓ సర్పంచ్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ ప్రచారం

జగిత్యాల జిల్లా : నన్ను గెలిపిస్తే రూ. 10 లక్షల విరాళమిస్తా..బాండ్‌‌‌‌‌‌‌‌, చెక్‌‌‌‌‌‌‌‌తో ఓ సర్పంచ్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ ప్రచారం

జగిత్యాల (బీమారం), వెలుగు : జగిత్యాల జిల్లా బీమారం మండలం వెంకట్రావుపేటలో సర్పంచ్‌‌‌‌‌‌‌‌గా బరిలో నిలిచిన ఓ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నాడు. గ్రామానికి చెందిన గులాం మహ్మద్‌‌‌‌‌‌‌‌ సర్పంచ్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌గా నామినేషన్‌‌‌‌‌‌‌‌ వేశారు. దీంతో తనను సర్పంచ్‌‌‌‌‌‌‌‌గా గెలిపిస్తే... గ్రామాభివృద్ధికి సొంతంగా రూ. 10 లక్షలు విరాళంగా ఇస్తానంటూ బాండ్‌‌‌‌‌‌‌‌ పేపర్‌‌‌‌‌‌‌‌, చెక్‌‌‌‌‌‌‌‌ రాసి ప్రచారం చేస్తున్నాడు. అలాగే తాను గెలిచిన వెంటనే సర్పంచ్‌‌‌‌‌‌‌‌, ఉపసర్పంచ్‌‌‌‌‌‌‌‌, ఇద్దరు వార్డు సభ్యులు, ఇద్దరు గ్రామ పెద్దలు, మహిళా సంఘం అధ్యక్షురాలు, స్కూల్‌‌‌‌‌‌‌‌ హెచ్‌‌‌‌‌‌‌‌ఎంతో గ్రామాభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసి, ఆ కమిటీ ఆధ్వర్యంలోనే రూ.10 లక్షలతో వివిధ అభివృద్ధి పనులు చేస్తానని ప్రకటించారు. తాను గెలిచిన వెంటనే ఈ నిధుల వినియోగం ప్రారంభిస్తానంటూ ప్రచారం చేస్తున్నారు.