
యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్ సరసన 'దేవర'తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. తన గ్లామర్, నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు మరో గ్లోబల్ స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధమైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ఆమె 'పెద్ది' చిత్రంలో నటిస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జాన్వీ ఈ సినిమా అనుభవాలు, రామ్ చరణ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇప్పుడు ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దర్శకత్వంపై ప్రశంసలు
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పని చేయడం తనకెంతో గొప్ప అనుభవాన్ని ఇస్తోందని జాన్వీ కపూర్ వెల్లడించింది.'పెద్ది' చిత్రీకరణ చాలా సరదాగా, ఉత్సాహంగా జరుగుతోంది. ఈ సినిమాలో తనది భిన్నమైన, ఆసక్తికరమైన పాత్ర అని చెప్పుకొచ్చింది.. బుచ్చిబాబు ఎంతటి 'రూటెడ్' దర్శకుడో 'ఉప్పెన' వంటి అద్భుతమైన సినిమా చూస్తే అర్థమవుతుంది" అని ప్రశంసించింది.
ఈ ప్రాజెక్ట్‌పై బుచ్చిబాబు విజన్‌ను అభినందిస్తూ, ఈ సినిమాలో తాను 'సాంప్రదాయ కథానాయిక'గా అనిపించడం లేదంటూ కీలక విషయం చెప్పింది. "ఆయనకు గొప్ప విజన్ ఉంది, ఆయన నన్ను చాలా ప్రోత్సహిస్తారు. నా కోసం ఆయన రాసిన పాత్ర చూస్తే, నేను ఇందులో కేవలం హీరోయిన్‌గా మాత్రమే కాకుండా ఒక ప్రాధాన్యత ఉన్న పాత్ర పోషిస్తున్నట్లు అనిపించడం లేదు అని జాన్వీ తెలిపింది. ఈ వ్యాఖ్యలు 'పెద్ది'లో జాన్వీ పాత్ర డెప్త్ గురించి అంచనాలను మరింత పెంచాయి.
రామ్ చరణ్'జెంటిల్‌మ్యాన్'
తన సహనటుడు రామ్ చరణ్‌పై కూడా అపారమైన అభిమానాన్ని జాన్వీ కపూర్ వ్యక్తం చేసింది. రామ్ సార్ అంటే నాకు చాలా ఇష్టం, ఆయన నిజంగా ఒక జెంటిల్‌మ్యాన్. ఆయన ఎనర్జీ అద్భుతంగా ఉంటుంది... చాలా శ్రద్ధగల, నిష్కపటమైన వ్యక్తి అంటూ ప్రశంసల జల్లు కురిపించింది. ఆయన ఇంత పెద్ద స్టార్ అయినప్పటికీ, సెట్‌కు ఒక విద్యార్థిలా వస్తారు. మళ్లీ ఆ సెట్‌కు ఎప్పుడు వెళ్తానా అని నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అంటూ జాన్వీ చెప్పుకొచ్చింది.
స్పోర్ట్స్ డ్రామాతో..
గ్రామీణ నేపథ్యంలో, ఒక స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. రామ్ చరణ్ ఇందులో పూర్తి రుస్టిక్, రగ్గడ్ అవతార్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్‌లో మజిల్స్ పెంచి, ముక్కుపుడకతో కనిపించిన ఆయన లుక్ విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో క్రికెట్, కుస్తీ వంటి గ్రామీణ క్రీడలకు సంబంధించిన సన్నివేశాలు కీలకమని తెలుస్తోంది.
ఈ చిత్రానికి ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు వంటి భారీ తారాగణం ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. ఈ మల్టీలింగువల్ చిత్రం మార్చి 27, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ గ్రామీణ నేపథ్యం గల స్పోర్ట్స్ డ్రామాలో జాన్వీ పాత్ర ఎలా ఉండబోతుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.