3గంటల పాటు నిలిచిపోయిన జియో సర్వీసులు

3గంటల పాటు నిలిచిపోయిన జియో సర్వీసులు

టెలికాం దిగ్గజం రిలయన్స్‌ జియో సేవలు నిలిచిపోయాయి. ఇన్ కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్, మెసేజ్ సర్వీసులు నిలిచిపోవడంతో కస్టమర్లు ఇబ్బందులు పడ్డారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు సర్వీసులు ఆగిపోవడంతో పలువురు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. అయితే ఇంటర్నెట్ సర్వీసులకు మాత్రం ఎలాంటి అవాంతరం కలగలేదు. కాల్, మెసేజ్ సర్వీసులు మూడు గంటల పాటు నిలిచిపోవడంతో కస్టమర్లు ఇబ్బందులు పడ్డారు.

జియో సర్వీసులు నిలిచిపోవడంపై సోషల్‌ మీడియాలో మీమ్స్‌ వైరల్‌గా మారాయి. తన మొబైల్‌లో ఉదయం నుంచి VoLTE సిగ్నల్ కనిపించడం లేదని, ఫోన్‌ కాల్స్‌ చేయలేకపోతున్నానని ఓ యూజర్ ట్వీట్‌ చేశాడు. సాధారణ కాల్స్‌లో సమస్యలు ఉన్నప్పుడు 5జీ సేవలు ఎలా అందిస్తారని కంపెనీని ప్రశ్నించాడు. ప్రస్తుతం ట్విట్టర్‌లో #Jiodown ట్రెండ్‌ అవుతున్నది. కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే తన ఫ్లైట్ మిస్సయిందని ఓ యూజర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఎవరు పరిహారం చెల్లిస్తారంటూ ప్రశ్నించాడు. అయితే, సర్వీసులు నిలిచిపోవడంపై కంపెనీ ఇప్పటి వరకు స్పందించలేదు.