నిమ్జ్ అనేది ఒక అద్భుతమైన ఆలోచన అని మంత్రి దామోదర్ రాజనర్సింహా అన్నారు. నిమ్జ్ రావడంతో జహీరాబాద్ నియోజకవర్గ చుట్టుపక్కల కూడా అభివృద్ధి జరుగుతుందని అన్నారు. నిమ్జ్ వల్ల 3.లక్షల మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ సుమారు 50 వేల కోట్ల వరకు కాస్ట్ పెరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చబోతున్నామని చెప్పారు.
రూ. 31 వేల కోట్ల రూపాయల రైతు రుణ మాఫీ కాంగ్రస్ ప్రభుత్వం చేయబోతున్నామని తెలిపారు. మల్లన్నసగర్ భునిర్వసుతుల కోసం. 123.Go. రద్దు చేయాలని ఆ సైన్డ్ భూములు పట్టా భూములకు సమానంగా నష్టపరిహారం చెల్లించాలని పోరాటం చేశామని ఈ మేరకు తగిన న్యాయం చేస్తామని చెప్పారు. సీఎం యువకుల కోసం ITI , స్కిల్ డౌలప్మెంట్ సెంటర్ లు తీసుకొస్తున్నారని వాటి వల్ల యువతలో ఎంతో నైపుణ్యత పెరుగుతుందని చెప్పారు.
