అమిత్ షా.. టంగ్ స్లిప్ తంటాలు..తీవ్రంగా తప్పుబట్టిన ప్రతిపక్ష నేతలు

అమిత్ షా.. టంగ్ స్లిప్ తంటాలు..తీవ్రంగా తప్పుబట్టిన ప్రతిపక్ష నేతలు
  • లోక్​సభలో ‘సాలా’ అని కామెంట్

న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా లోక్‌‌‌‌సభలో ఎలక్టోరల్ రిఫామ్స్ పై జరిగిన చర్చలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ‘సాలా’ అనే పదాన్ని ఉపయోగించారు. దీనిపై అపోజిషన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సభలో ‘సాలా’ అని అమిత్ షా కామెంట్ చేయడాన్ని తప్పుబడుతున్నారు. 

అమిత్ షా కామెంట్లు చేసినప్పుడు ఆయన పక్కనే ఉన్న బీజేపీ ఎంపీలు కమలేశ్ పాశ్వాన్, రవణీత్ సింగ్ నవ్వుతున్నారు. అనుకోకుండా అమిత్ షా టంగ్ స్లిప్ అయ్యారని కిరణ్ రిజిజు ప్రకటించినా విమర్శలు ఆగడంలేదు. ఈ పదాన్ని రికార్డు నుంచి తొలగించాలని స్పీకర్​కు విన్నవించారు. కాగా, ఎన్నికల సంస్కరణల అంశంపై అమిత్ షా మాట్లాడుతూ.. ‘సాలా ఈ చునావ్ ఆయోగ్...” అని అన్నారు. 

అమిత్ షా ‘సాలా’ పదం వాడటంతో వారి భయం, అసత్యాలు బయటపడ్డాయని రాహుల్ విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్​ హ్యాండిల్ కూడా అమిత్ షా వీడియోను వైరల్ చేస్తున్నది. ‘చునావ్ ఆయోగ్ అమిత్ షా కా సాలా హై?’ (ఎన్నికల సంఘం అమిత్ షా బావమరిదినా?) అని పోస్ట్ చేసింది.