ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం : కలెక్టర్ కుమార్ దీపక్

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం : కలెక్టర్ కుమార్ దీపక్
  • 1200 మందికిపైగా పరీక్షలు

నస్పూర్, వెలుగు: సామాజిక సేవ కార్యక్రమంలో భాగంగా జర్నలిస్టులు ఉచిత మెగా సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. నస్పూర్   శ్రీరాంపూర్ ప్రెస్​క్లబ్ ఆధ్వర్యంలో కరీంనగర్ రెనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, మంచిర్యాల మెడిలైఫ్ ఆస్పత్రి సహకారంతో నస్పూర్ ప్రెస్ క్లబ్ ఆవరణలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని కలెక్టర్, రెనే ఆస్పత్రి చైర్మన్ బంగారి స్వామి ప్రారంభించగా, శ్రీరాంపూర్ ఎరియా ఎస్వోటు జీఎం సత్యనారాయణ ఈసీజీ, టూడీ ఎకో సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెనె, మెడిలైఫ్ ఆస్పత్రుల యాజమాన్యాలు సామాజిక సేవా దృక్పథంతో ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యసేవలు అందించడం హర్షనీయమన్నారు. 

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇలాంటి సేవలు అభినందనీయమని, భవిష్యత్తులో మరిన్ని చేపట్టాలని కోరారు. ఈ శిబిరానికి దాదాపు 1200 మందికి పైగా వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోగా వారికి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రుల యాజమాన్యాలకు, సింగరేణి, పోలీస్ అధికారులకు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు భూపతి రవి, ఉపాధ్యక్షుడు శ్రీపతి రాములు గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో క్యాంపు కో-ఆర్డినేటర్లు పుల్లూరి సుధాకర్, వసీమోద్దీన్, రెనె ఆసుపత్రి జీఎం పవన్ ప్రసాద్, నాన్ సర్జికల్ డైరెక్టర్ అరవిందరావు, మెడిలైఫ్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ కుమారస్వామి, డాక్టర్లు, ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.