ఎన్టీఆర్ వర్ధంతి.. జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళి

 ఎన్టీఆర్ వర్ధంతి.. జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళి

నందమూరి తారకరామారావు వర్థంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు.  జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణరామ్ తో పాటు పలువురు నందమూరి కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ను తలచుకుని జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. తెలుగు వారి కోసం ఎన్టీఆర్ చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని తెలంగాణతో పాటు  ఏపీలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 

తెలుగు తెరకు మకుటం లేని మహారాజు ఎన్టీఆర్.. వెండితెరపై రాముడైనా.. కృష్ణుడైనా..మరే పాత్ర అయినా..ఎన్టీఆర్ చేస్తేనే ఆ పాత్రకు నిండుదనం వచ్చేది. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో తనదైన ముద్రవేసి.. పార్టీని స్తాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. ముఖ్యమంత్రి పదవిని అధిరోహించారు.  ఓ నటుడిగా, దర్శకుడిగా,నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా , ముఖ్యమంత్రిగా ఎవరికి సాధ్యం కాని రికార్డులను సృష్టించారు.