
- ఎస్సీ వర్గీకరణలో కాంగ్రెస్ తీరును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటన
హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మంగళవారం మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో 50 మంది నామినేషన్లు వేశారు. ఈ సందర్భంగా మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని..దీనివల్ల 6 నెలలుగా మాల విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు నష్టపోతున్నారని తెలిపారు. దీనికి నిరసన తెలియజేస్తూ 50 నామినేషన్లు వేసినట్టు తెలిపారు.
ఐదు నెలలుగా విద్య, ఉద్యోగ, ప్రమోషన్లలో మాల సామాజిక వర్గంతో సహా 57 ఎస్సీ కులాలకు జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి, వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులకు అనేకసార్లు వినతిపత్రాలు సమర్పించినా ఎటువంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.