సీజ్ద షాప్స్.. జూబ్లీహిల్స్ నీరూస్ షోరూంను హైడ్రా ఎందుకు సీజ్ చేసిందంటే..

సీజ్ద షాప్స్.. జూబ్లీహిల్స్ నీరూస్ షోరూంను హైడ్రా ఎందుకు సీజ్ చేసిందంటే..
  • జూబ్లీహిల్స్​ నీరూస్, నాంపల్లిలో ఫర్నిచర్​ షాపు సీజ్
  • రూల్స్​పాటించకపోవడంతో హైడ్రా చీఫ్​ యాక్షన్​ 
  • కరెంట్​ కట్​ చేసి మూత.. అన్​సేఫ్ ​అంటూ బోర్డులు ఏర్పాటు

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఫైర్ సేఫ్టీ రూల్స్​పాటించని షాపులపై హైడ్రా కొరఢా ఝులిపించింది. నాంపల్లిలోని బచ్చాస్​ ఫర్నిచర్​ షోరూంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనల్లాంటివి పునరావృతం కాకుండా షాపులు, కాంప్లెక్స్​లు, మాల్స్, షోరూమ్స్​లలో గురువారం హైడ్రా కమిషనర్​రంగనాథ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. ఇందులో హైడ్రాతో పాటు ఫైర్, జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖ‌‌ల‌‌  అధికారులు పాల్గొన్నారు.

జూబ్లీహిల్స్ రోడ్​నంబ‌‌ర్​36 లోని నీరూస్ షోరూంను చెక్​చేయగా పైన అదనంగా రూఫ్ షెడ్డు వేసి బట్టల గో డౌన్​లా వాడడంపై సీరియస్ ​అయ్యారు. మొత్తం ఐదంతస్తుల్లో గోదాముల మాదిరిగా  స్టాక్ ఉంచ‌‌డంపై రంగనాథ్​ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు షాపుకు ఫైర్ ఎన్వోసీ, ఫైర్ ఎక్ట్సింగ్విషర్ (మంట‌‌ల‌‌ను ఆర్పేది) కూడా స‌‌రిగ్గా లేవని తెలుసుకున్నారు. దీంతో కరెంట్​సరఫరా నిలిపివేసి సీజ్​చేయాలని ఆదేశించారు. ఫైర్ అన్ సేఫ్ అని  షోరూమ్ ముందు బోర్డు పెట్టారు. లోపలకి వెళ్లేందుకు వీలు లేకుండా ఫెన్సింగ్ వేశారు.

నాంప‌‌ల్లిలోనూ యాక్షన్​
నాంప‌‌ల్లిలోని బ‌‌చ్చాస్ ఫ‌‌ర్నిచ‌‌ర్ షోరూంలో ఐదు రోజుల క్రితం అగ్ని ప్రమాదం జరగ్గా..సరిగ్గా అదే రోడ్డులోని షాపులు ఇప్పటికీ రూల్స్​పాటించకపోవడంపై రంగనాథ్​ఫైరయ్యారు. తనిఖీల్లో భాగంగా నాంప‌‌ల్లి స్టేష‌‌న్ రోడ్డులోని ర‌‌హీమ్‌‌ అండ్ మ‌‌న్నన్ ఎస్టేట్స్ స్టాండ‌‌ర్డ్ ఫ‌‌ర్నిచ‌‌ర్ దుకాణాన్ని చెక్​చేశారు. ఈ బిల్డింగ్​ఆరంత‌‌స్తులుండ‌‌గా సెల్లార్​తో పాటు మొత్తం అన్ని అంత‌‌స్తుల్లో భారీగా ఫ‌‌ర్నిచ‌‌ర్ స్టోర్ చేశారు. 

మెట్ల దారిని కూడా మూసేసి  స్టాక్ పెట్టారు. దీంతో ఎంత చెప్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని క‌‌మిష‌‌న‌‌ర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైర్ ఎన్​వోసీ లేక‌‌పోవడం, ఆరంతస్తుల్లో ఎక్కడా ఫైర్ ఎక్ట్సింగ్విషర్ పెట్టకపోవడంతో సీజ్​చేయాలని ఆదేశించారు. దీంతో కరెంట్​సరఫరా ఆపేసి సీజ్​చేశారు.  

నా నంబర్​ 7207923085
ఎక్కడైనా ఫైర్ సేఫ్టీ రూల్స్​ఉల్లంఘించిన‌‌ట్టు ఎవ‌‌రైనా గ‌‌మ‌‌నిస్తే హైడ్రా కంట్రోల్ రూమ్ 9000113667తో పాటు నేరుగా త‌‌న నంబ‌‌రు 7207923085 కు స‌‌మాచారం ఇవ్వాల‌‌ని హైడ్రా చీఫ్​రంగనాథ్​ ప్రజ‌‌ల‌‌కు సూచించారు. సెల్లార్లలో పార్కింగ్​ చేయకుండా వ్యాపార కేంద్రాలుగా మార్చడం, ఫైర్​సేఫ్టీ రూల్స్​పాటించకపోవడాన్ని ఇక సహించేది లేదన్నారు. 

రూల్స్​ పాటించని షాపు, షాపింగ్​ కాంప్లెక్స్ ​వివరాలు, ఏ ప్రాంతంలో ఉన్నది స్పష్టంగా పేర్కొంటూ వాట్సాప్ ద్వారా, ఫొటోలు, వీడియోలు పంపాల‌‌ని సూచించారు. Commissioner Hydraa పేరుతో ఉన్న ఎక్స్​లోనూ ఫిర్యాదు చేయవచ్చన్నారు.