- గుర్రంగూడలో డీఆర్ఎస్ వరల్డ్ స్కూల్ ప్రారంభం
ఎల్బీనగర్, వెలుగు: కార్పొరేట్ స్కూళ్లు విద్యార్థులను ర్యాంక్‌ల మోజులోకి తీసుకెళ్తున్నాయని, అది మారాల్సిన అవసరం ఉందని సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. వనస్థలిపురం గుర్రంగూడలో కొత్తగా ఏర్పాటైన డీఆర్ఎస్ వరల్డ్ స్కూల్‌ను ఆయనతోపాటు ప్రొఫెసర్ కోదండరాం, సినీ నటి హెబ్బా పటేల్ కలిసి ప్రారంభించారు. విద్య ఎప్పుడూ వ్యాపారం కావద్దని, విద్యార్థులను బ్రాండ్ అంబాసిడర్లుగా తయారు చేయాలన్నారు.
డీఆర్ఎస్ వరల్డ్ స్కూల్ చైర్మన్ రాజు సంగని, డైరెక్టర్ చంద్రమౌళి మాట్లాడుతూ.. వనస్థలిపురం, గుర్రంగూడ పరిసర ప్రాంతాల విద్యార్థులకు వరల్డ్ క్లాస్ విద్య అందించాలనే ఉద్దేశంతో ఈ పాఠశాలను ఏర్పాటు చేశామన్నారు.
ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ విశాల తరగతి గదులు, ఆధునిక సైన్స్ ల్యాబ్, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, కోడింగ్, రోబోటిక్స్ ల్యాబ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్, ప్రత్యేక క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశామని వివరించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు సయ్యద్ ఇమామ్, సయ్యద్ ఖాసిఫ్, స్కూలు సిబ్బంది, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
