జోర్డాన్‌‌‌‌కు డ్రాగన్‌‌‌‌.. ఫిబ్రవరి 5 నుంచి అక్కడ కీలక షెడ్యూల్‌

జోర్డాన్‌‌‌‌కు డ్రాగన్‌‌‌‌..  ఫిబ్రవరి 5 నుంచి అక్కడ కీలక షెడ్యూల్‌

ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.  ‘డ్రాగన్‌‌‌‌’ అనే టైటిల్‌‌‌‌ పరిశీలనలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించి తదుపరి షెడ్యూల్‌‌‌‌ జోర్డాన్‌‌‌‌ దేశంలో జరగబోతోందని సమాచారం.

ఫిబ్రవరి 5 నుంచి అక్కడ కీలక షెడ్యూల్‌‌‌‌ను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ తన క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ మేకోవర్‌‌‌‌‌‌‌‌తో పాటు అక్కడి వాతావరణానికి అలవాటు పడేందుకు షూటింగ్‌‌‌‌కు రెండు రోజుల ముందే జోర్డాన్‌‌‌‌కు వెళుతున్నట్టు తెలుస్తోంది. 

ఈ హై వోల్టేజ్‌‌‌‌ యాక్షన్‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌లో ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌కు జంటగా రుక్మిణీ వసంత్‌‌‌‌ నటిస్తోంది. ఇక ఎన్టీఆర్ వ్యక్తిత్వం, ప్రచార హక్కులకు రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎన్టీఆర్ పేరు, ఫోటోలు, ఇమేజ్‌‌‌‌ను అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించడం చట్టవిరుద్ధమని ఆదేశాలు జారీ చేసింది.