మున్సిపల్ ఎన్నికలకు సహకరించండి : కలెక్టర్ సంతోష్

మున్సిపల్ ఎన్నికలకు సహకరించండి : కలెక్టర్ సంతోష్

గద్వాల, వెలుగు: మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ సంతోష్ కోరారు. గురువారం కలెక్టరేట్ లో లీడర్లతో మీటింగ్ నిర్వహించారు. పబ్లిక్ మీటింగ్స్, ర్యాలీల నిర్వహణకు పోలీస్ శాఖ అనుమతి తీసుకోవాలని చెప్పారు.మొదటి ర్యాండమైజేషన్ ద్వారా మున్సిపల్ ఎన్నికల సిబ్బందిని కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు.

గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీల్లో మొత్తం 77 వార్డులకు 189 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. గ్రౌండ్ వాటర్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. కలెక్టరేట్ లో సంబంధిత ఇంజినీర్లు, ఫీల్డ్​టెక్నికల్​అసిస్టెంట్లకు గ్రౌండ్ వాటర్ సంరక్షణపై గురువారం శిక్షణనిచ్చారు. కార్యక్రమంలో సీజీడబ్ల్యూబీ శాస్త్రవేత్తలు మాధవ్, వెంకటగిరి, యాదయ్య, గ్రౌండ్ వాటర్ డీడీ మోహన్ తదితరులు పాల్గొన్నారు.