వాస్తవం, భ్రమకు మధ్య 'ది మేజ్‌‌‌‌' సినిమా

వాస్తవం, భ్రమకు మధ్య 'ది మేజ్‌‌‌‌' సినిమా

శ్రీరామ్‌‌‌‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'ది మేజ్‌‌‌‌'. ప్రియాంక శర్మ , హృతిక శ్రీనివాసన్ హీరోయిన్స్‌‌‌‌.  డా. రవికిరణ్ గడలే దర్శకుడు. కేఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ సమర్పణలో ఉదయ్ కె. రెడ్డి పల్వాయి, కె. శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు.  గురువారం ఈ మూవీ ఫస్ట్‌‌‌‌లుక్‌‌‌‌, టైటిల్‌‌‌‌ గ్లింప్స్‌‌‌‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘మానసిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి కథ ఇది.  అతను ఒక కలల ప్రపంచంలో జీవిస్తున్నట్టుగా అనిపిస్తుంది.

వాస్తవం,  భ్రమకు మధ్య సరిహద్దులను చెరిపేస్తూ  ప్రేక్షకులను చివరి వరకూ ఉత్కంఠలో ఉంచుతుంది. కొత్తదనం ఉన్న సినిమాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది’ అని చెప్పారు.  అజయ్‌‌‌‌, రవివర్మ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి శ్రవణ్‌‌‌‌ భరద్వాజ్‌‌‌‌ అందిస్తున్నాడు.