‘అసురగణ రుద్ర’ నుంచి నీ మాయలో పడేటట్టుగా సాంగ్ రిలీజ్

‘అసురగణ రుద్ర’ నుంచి నీ మాయలో పడేటట్టుగా సాంగ్ రిలీజ్

ఇటీవల ‘గుర్రం పాపిరెడ్డి’ చిత్రంతో ఆకట్టుకున్న నరేష్‌‌‌‌ అగస్త్య.. త్వరలో మరో కొత్త చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. తను హీరోగా ‘అసురగణ రుద్ర’ అనే థ్రిల్లర్‌‌‌‌ రూపొందుతోంది. సంగీర్తన విపిన్‌‌‌‌, ఆర్యన్‌‌‌‌ రాజేష్‌‌‌‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గురువారం ఈ చిత్రం నుంచి ‘నీ మాయలో పడేట్టుగా అనే పాటను విడుదల చేశారు. 

శేఖర్ చంద్ర కంపోజ్ చేసిన మెలోడియస్‌‌‌‌ సాంగ్‌‌‌‌ను రమ్య బెహరా, సిద్ధార్థ్ మీనన్ పాడారు.  చైతు సత్సంగి అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. కొత్త జంట తమ ప్రేమను సెలబ్రేట్‌‌‌‌ చేసుకునే సందర్భంలో వచ్చే ఈ పాటలో లీడ్ పెయిర్‌‌‌‌‌‌‌‌ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. మురళీ కాట్రగడ్డ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని మురళి కమ్జుల, వంశీ కాంజుల నిర్మిస్తున్నారు. మురళీ శర్మ, శత్రు, రవివర్మ, శుభలేఖ సుధాకర్, ప్రియాంక శర్మ, అమిత్ శర్మ, దేవి ప్రసాద్, ఆమని, నిఖిల్ దేవదూల, బేబీ శ్రీదేవి  ఇతర పాత్రలు పోషిస్తున్నారు.