అచ్చంపేట, వెలుగు: అచ్చంపేట పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. గురువారం అచ్చంపేట మున్సిపాలిటీలోని సాయి నగర్ కాలనీలో మార్నింగ్ వాక్ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. పట్టణంలోని ప్రతీ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తోపాటు సీసీరోడ్ల నిర్మాణం చేపడుతామన్నారు. రానున్న వేసవిలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసులు, జిల్లా లైబ్రరీ చైర్మన్ రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతటి రజిత, మాజీ ఎంపీపీ రామనాథం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపాల్ రెడ్డి, వై.శ్రీనివాసులు, లాలూ యాదవ్, సలేశ్వరం తదితరులు పాల్గొన్నారు.
