న్యూఢిల్లీ: ఆర్థిక గొడవలతో స్వాట్(ఎస్డబ్ల్యూఏటీ) కమాండోగా పనిచేస్తున్న తన భార్యను భర్త హత్య చేశాడు. నిండు గర్భిణి అనే కనికరం కూడా చూపకుండా డంబెల్తో కొట్టి చంపేశాడు. అంతేకాదు.. ఆమె సోదరుడికి కాల్ చేసి.. ఈ కాల్ రికార్డ్ చేసి ఉంచుకోమని, సాక్ష్యంగా పనికొస్తుందని.. నీ సోదరిని చంపుతున్నానని కాల్ చేసిన ఘటన కలకలం రేపింది. ఢిల్లీలో ఈనెల 22న ఈ ఘోరం జరిగింది. కాజల్ చౌదరి 2022లో ఢిల్లీ పోలీసు విభాగంలో చేరి స్వాట్ కమాండోగా పనిచేస్తున్నది. ఆమెకు డిఫెన్స్ మినిస్ట్రీలో క్లర్క్‌గా పనిచేసే అంకుర్తో 2023లో పెండ్లైంది. వీరు ఈనెల 22న ఆర్థికపరమైన విషయాలపై గొడవ పడ్డారు.
అవి తీవ్రరూపం దాల్చడంతో అంకుర్ ఇంట్లోని డంబెల్తో భార్య తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మంగళవారం మరణించింది. అదనపు కట్నం కోసం భర్త, అతడి కుటుంబం వేధించేడంతోనే కాజల్ మరణించిందని మృతురాలి సోదరుడు నిఖిల్ ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు హత్య కేసును నమోదు చేసి, అంకుర్ను అరెస్ట్ చేశారు.
‘ఈజ్ కాల్ కో రికార్డింగ్ పె రఖ్, పోలీస్ ఎవిడెన్స్ మీ కామ్ ఆయేగా. మైన్ మార్ రహా హూన్ తేరీ బెహెన్ కో. పోలీస్ మేరా కుచ్ నహీ కర్ పాయేగి' అని అంకుర్ కాల్ లో చెప్పాడని కాజల్ చౌదరి భర్త ఆమె తమ్ముడికి కాల్ చేసి చెప్పాడు.
‘ఈ కాల్‌ను రికార్డ్ చేస్కో.. ఇది పోలీసు సాక్ష్యంగా ఉపయోగపడుతుంది. నేను మీ సోదరిని చంపుతున్నాను. పోలీసులు ఏమీ చేయలేరు’ అని కాల్ చేసి చెప్పేసి భార్యను డంబెల్ తో కొట్టి చంపేశాడు. అంతేకాదు.. ఆ కాల్లో ఉండగానే తన అక్క బాధతో అరుస్తున్నట్లు వినిపించిందని.. సడన్గా కాల్ కట్ అయిందని కాజల్ చౌదరి సోదరుడు పోలీసులకు చెప్పాడు.
