CUSATలో టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ ఉద్యోగాలు: ఐటీఐ, డిప్లొమా చేసినోళ్లకు అవకాశం..

CUSATలో టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ ఉద్యోగాలు: ఐటీఐ, డిప్లొమా చేసినోళ్లకు అవకాశం..

కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (సీయూఎస్ఏటీ) టెక్నికల్ అసిస్టెంట్/ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. 

ఖాళీలు: 07.

విభాగాల వారీగా ఖాళీలు: టెక్నీషియన్ గ్రేడ్ I 01, టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ I 06.

ఎలిజిబిలిటీ:  గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్​లో ఐటీఐ, సంబంధిత విభాగంలో కంప్యూటర్ సైన్స్​లో డిప్లొమా లేదా బీఎస్సీ పూర్తిచేసి ఉండాలి. 

వయోపరిమితి: 18 నుంచి 36 ఏండ్లు ఉండాలి.   కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

లాస్ట్ డేట్: ఫిబ్రవరి 20. 

పూర్తి వివరాలకు  recruit.cusat.ac.in వెబ్​సైట్​ను సందర్శించండి.