భూసేకరణ వేగవంతం చేయాలి : కలెక్టర్ సంతోష్

భూసేకరణ వేగవంతం చేయాలి : కలెక్టర్ సంతోష్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: జిల్లాలో 167కే జాతీయ రహదారికి అవసరమైన కొల్లాపూర్, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల పరిధిలో భూ సేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్​లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులకు త్వరగా పరిహారం చెల్లించాలని చెప్పారు.   

ఇంటిగ్రేటెడ్ స్కూల్ ​పనులు ప్రారంభించాలి 

ఉప్పునుంతల: అచ్చంపేట నియోజకవర్గానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ ​పనులు ప్రారంభించాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. రాయిచెడ్ లో పాఠశాల కోసం ఎంపిక చేసిన స్థలాన్ని గురువారం ఆయన పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటించాలని, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని చెప్పారు.  

యాప్ ద్వారానే యూరియా ఇవ్వాలి

అచ్చంపేట: రైతులకు యాప్​ ద్వారానే యూరియా ఇవ్వాలని కలెక్టర్    సంతోష్  ఆదేశించారు. గురువారం పట్టణంలోని ఫర్టిలైజర్  షాపులను తనిఖీ చేశారు.  రైతులు ఫర్టిలైజర్  బుకింగ్  యాప్‌‌‌‌‌‌‌‌ను డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్  చేసుకొని, యూరియా బుక్  చేసుకోవాలన్నారు. యూరియా పంపిణీలో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.