సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CSIR CCMB) టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 23.
ఖాళీలు: 80.
విభాగాల వారీగా ఖాళీలు: టెక్నీషియన్ (I) 50, టెక్నికల్ అసిస్టెంట్ 25, టెక్నీషియన్ ఆఫీసర్ 05.
ఎలిజిబిలిటీ
టెక్నీషియన్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి సైన్స్ సబ్జెక్టులతో ఎస్ఎస్సీ/ పదో తరగతి లేదా సమాన అర్హత ఉండాలి. కనీసం 55 శాతం మార్కులతో ఐటీఐ సర్టిఫికెట్ / నేషనల్/ స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ లేదా రెండేండ్ల అప్రెంటీస్ అనుభవం లేదా నిర్దిష్ట ట్రేడుల్లో మూడేండ్ల పని అనుభవం ఉండాలి.
టెక్నికల్ అసిస్టెంట్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో బీఎస్సీతోపాటు ఏడాది అనుభవం ఉండాలి
లేదా కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమాతోపాటు రెండేండ్ల అనుభవం ఉండాలి.
టెక్నికల్ ఆఫీసర్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో ఎంఎస్సీ లేదా సంబంధిత విభాగంలో 55 శాతం మార్కులతో బీఈ/ బి.టెక్. పూర్తిచేసి ఉండాలి. ఏడాది నుంచి మూడేండ్ల అనుభవం ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 30 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జనవరి 27.
లాస్ట్ డేట్: ఫిబ్రవరి 23.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్ట్, ట్రేడ్ టెస్ట్/ రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.barc.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
