డార్లింగ్ ఫ్యాన్స్.. ‘రాజా సాబ్’ను మర్చిపోండి.. దసరాకు ఫౌజీ వచ్చేస్తోంది !

డార్లింగ్ ఫ్యాన్స్.. ‘రాజా సాబ్’ను మర్చిపోండి..  దసరాకు  ఫౌజీ వచ్చేస్తోంది !

ఈ సంక్రాంతికి ‘రాజా సాబ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రభాస్.. దసరాకు మరోసారి ఆడియెన్స్‌‌ను పలకరించబోతున్నాడు. ప్రస్తుతం ఆయన వరుస  ప్రాజెక్టుల్లో నటిస్తుండగా, వాటిలో హను రాఘవపూడి రూపొందిస్తున్న చిత్రం ‘ఫౌజీ’. తాజాగా ఈ మూవీ గురించి క్రేజీ అప్‌‌డేట్‌‌ను అందించారు మేకర్స్. 

ఈ చిత్రాన్ని దసరా కానుకగా వరల్డ్‌‌వైడ్‌‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.  దీనికోసం ఇప్పట్నుంచి  షూటింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి విరామం లేకుండా కంటిన్యూ షెడ్యూల్ కొనసాగుతుందని, ఇది విజువల్ వండర్‌‌‌‌గా ఉండబోతోందని టీమ్ చెబుతోంది.

ఇందులో ప్రభాస్‌‌ని ఇంతకుముందు ఎప్పుడూ చూడని పవర్‌‌‌‌ఫుల్ క్యారెక్టర్‌‌‌‌లో చూపించబోతున్నామని అన్నారు. ప్రభాస్ సరసన హీరోయిన్‌‌గా ఇమాన్వీ నటిస్తోంది. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భాను చందర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 

టి-సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్‌‌తో వరల్డ్‌‌ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్‌‌తో నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగుతో పాటు  తమిళం, కన్నడ, మలయాళ, హిందీ,  బెంగాలీ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు.