మద్దూరు, వెలుగు: మద్దూరు మున్సిపాలిటీలో నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించాలని నారాయణ పేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. గురువారం పలు నామినేషన్సెంటర్లను పరిశీలించారు. తెలుగుతోపాటు ఇంగ్లిష్ భాషలో ఉన్న నామినేషన్‌పత్రాలు అందుబాటులో ఉంచాలన్నారు. నామినేషన్లను ఎప్పటికప్పుడు టీ పోల్ యాప్ లో అప్లోడ్ చేయించాలని కమిషనర్లకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్కమిషనర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి
కోస్గి, వెలుగు: మున్సిపల్ ఎన్నికల విధులను అధికారులు, సిబ్బంది పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. గురువారం కోస్గి మున్సిపల్ ఆఫీస్‌ను ఆమె తనిఖీ చేశారు. నామినేషన్ల వివరాలను తెలుసుకున్నారు. బ్యాలెట్‌బాక్సులను పరిశీలించారు. అనంతరం పీఏసీఎస్కార్యాలయానికి వెళ్లి, యూరియా కొనుగోలుపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. డీఏవో జాన్ సుధాకర్, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, ఏవో రామకృష్ణ తదితరులున్నారు.
పెబ్బేరు, వెలుగు: నామినేషన్ల డీటైల్స్‌ను ఎప్పటికప్పుడు టీ పోల్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్వహించాలని సూచించారు.
గురువారం పెబ్బేరు మున్సిపాలిటీలో నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. వివిధ అంశాలపై సూచనలు చేశారు. అడిషనల్ కలెక్టర్ యాదయ్య, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ మురళీ గౌడ్, ఎంపీడీవో వెంకటేశ్, కమిషనర్ ఖాజా ఆరీఫుద్దీన్ పాల్గొన్నారు.
