- గుండెపోటుతో భర్త.. అస్వస్థతకు గురై భార్య
రామడుగు, వెలుగు : గంటల వ్యవధిలోనే వృద్ధ దంపతులు మృతిచెందారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కొరటపల్లి గ్రామానికి చెందిన మేకల సుందర్‌రెడ్డి(85), అనారోగ్యంతో బాధపడుతుండగా కుటుంబసభ్యులు కరీంనగర్‌లోని ఆస్పత్రిలో జాయిన్ చేశారు. చికిత్సపొందు తూ బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో చనిపోయాడు.
సుందర్‌రెడ్డి అంత్యక్రియలు మధ్యాహ్నం పూర్తి చేశారు. అదే రోజు సాయంత్రం అతని భార్య మణెమ్మ(78) తీవ్ర అస్వస్థతకు గురవగా కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. ఒకే రోజు దంపతుల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
