హైదరాబాద్, వెలుగు: ఏబీసీ గ్రూప్ ఇంటర్నేషనల్, పటేల్ మార్కెటింగ్ గ్రూప్, శుభగృహ గ్రూప్ నిర్మించిన ఏబీసీ స్పేసరీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్/హోమ్ సొల్యూషన్స్ కేంద్రం హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ వద్ద ప్రారంభమయింది.
దాదాపు 75 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ షోరూమ్ టైల్స్, బాత్ ఫిట్టింగ్స్, కిచెన్, ఫర్నిచర్, స్మార్ట్ హోమ్ టెక్నాలజీ వంటి అనేక విభాగాల్లో అంతర్జాతీయ బ్రాండ్ల ప్రొడక్టులను అందిస్తుంది.
జాగ్వార్ గ్రూప్ ప్రమోటర్ రాజేష్ మెహ్రా, ఏబీసీ గ్రూప్ చైర్మన్ మహమ్మద్ మదానీ ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఇండ్ల డిజైన్, నిర్మాణంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడమే తమ లక్ష్యమని ఏబీసీ స్పేసరీ ప్రకటించింది.
