బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్‌కు తెలుగులోనూ మంచి ఇమేజ్ ఉంది. ప్రభాస్‌తో ‘సాహో’లో నటించిన ఆమె.. మరో సౌత్ ప్రాజెక్టులో జాయిన్ అవుతుందని తెలుస్తోంది. అల్లు అర్జున్ హీరోగా తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఫిమేల్ లీడ్‌గా శ్రద్ధా కపూర్‌ను సెలెక్ట్ చేశారని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే వీరికాంబోపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే చాన్స్ ఉంది.
రెండేళ్ల క్రితం ‘స్త్రీ 2’ చిత్రంలో తనదైన నటనతో ఆకట్టుకున్న శ్రద్ధా కపూర్.. ఈ చిత్రానికి గాను విమర్శకుల ప్రశంసలతోపాటు అనేక అవార్డులను అందుకుంది. ఈ మూవీ తర్వాత ఆమె నటిస్తున్న చిత్రంతో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం బన్నీ.. అట్లీ డైరెక్షన్‌లో బిజీగా ఉండటంతో ఈ మూవీ పూర్తవగానే లోకేష్‌తో మూవీ స్టార్ట్ చేయనున్నాడు. ఈ చిత్రం యాక్షన్, ఎమోషన్‌తో పాటు లోకేష్ మార్క్ ఇంటెన్స్ నెరేషన్‌తో ఉండబోతుందని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మిస్తున్నారు.
