ఓమ్నిపోల్‌తో శక్తి ఏవియేషన్‌ ఒప్పందం.. ఎల్ 410 విమానాల తయారీ కోసం..

ఓమ్నిపోల్‌తో శక్తి ఏవియేషన్‌ ఒప్పందం.. ఎల్ 410 విమానాల తయారీ కోసం..

హైదరాబాద్​, వెలుగు: వింగ్స్ ఇండియా 2026 వేదికగా శక్తి ఏవియేషన్ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్ (ఎస్ఏడీఎస్​పీఎల్), ఓమ్నిపోల్ గ్రూప్ మధ్య కీలక ఒప్పందం జరిగింది. 19 సీట్ల సామర్థ్యం ఉన్న ఎల్ 410 ఎన్​జీ విమానాలను భారత్‌‌లో తయారు చేయడానికి ఇరు సంస్థలు చేతులు కలిపాయి.

పౌర విమానయాన శాఖ మంత్రి  రామ్మోహన్ నాయుడు సమక్షంలో ఈ ప్రకటన వెలువడింది. దేశీయంగా విమానాల తయారీ కేంద్రం ఏర్పాటుకు టెక్నాలజీని బదిలీ చేసుకుంటాయి. తక్కువ దూరం ఉన్న రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేలపై నుంచి కూడా  ఈ విమానాలు టేకాఫ్ అవ్వగలవు.  మారుమూల ప్రాంతాలకు విమాన సేవలు అందించడంలో ఇవి సాయడపతాయి.